సమంత గురించి శ్రీరెడ్డి కామెంట్... ఎవరూ ఊహించలేదు!
కాస్టింగ్ కౌచ్ ఇష్యూ తెరపైకి తెచ్చి పలువు సినీ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, నిర్మాతలు, హీరోలపై సంచలన ఆరోపణలు చేయడం ద్వారా కాంట్రవర్సల్ లేడీగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో ఎవరి గురించైనా కామెంట్స్ పెట్టిందంటే... ఆ కామెంట్స్ దాదాపుగా వారిని విమర్శించుకుంటూనే ఉంటాయి.
శ్రీరెడ్డి చాలా రేర్‌గా ఎవరినైనా లేదా ఏ సినిమా నైనా పొగుడుతూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. తాయిగా ఆమె ఎవరూ ఊహించని విధంగా సమంత గురించి, ఆమె నటించిన యూటర్న్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సమంత యూటర్న్ గురించి శ్రీరెడ్డి ఏమన్నారంటే?
‘యూ టర్న్ మూవీ తమిళంలో పెద్ద హిట్టయింది. కంగ్రాట్స్ సమంత... నాకు కూడా ఈ మూవీ ఎంతగానో నచ్చింది' అంటూ శ్రీరెడ్డి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

కొన్ని నెలల క్రితం పరిస్థితి వేరు
కొన్ని నెలల క్రితం పరిస్థితి చూస్తే... సమంత, నయనతార, కాజల్, తమన్నా, త్రిష లాంటి వారితో శ్రీరెడ్డి విభేదించింది. వీరి పేర్లను అప్పట్లో ఆమె బయటకు డైరెక్టుగా వెల్లడించలేదు కానీ.... వారు సైతం కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో శ్రీరెడ్డి టాప్ హీరోయిన్ల గురించి
అప్పట్లో శ్రీరెడ్డి కొందరు నటీమణుల పేర్లు బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పుడు తన ఫేస్ బుక్ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కొందరు నా వద్ద ఉన్న లిస్ట్ చాలా పెద్దది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఈ లిస్ట్ చాలా చిన్నది. ఒకవేళ tris..,nay..t..a,ka..l,sa..t.. మంచి యాక్టర్లు అయితే, ఈ టాప్ హీరోయిన్లంతా వారి వద్ద ఉన్న లిస్ట్ ఓపెన్ చేస్తే దాన్ని పెద్ద లిస్ట్ అంటారు, అదే జరిగితే కొందరి గుండె ఆగిపోయే అవకాశం ఉంది' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

తమిళ సినిమాల్లో శ్రీరెడ్డి బిజీ బిజీ
ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఓ సినిమా కోసం ఆమె బరువు కూడా పెరుగుతున్నారు. తమిళ ప్రేక్షకులకు సన్నగా ఉండేవారికంటే కాస్త బొద్దుగా ఉండే వారంటేనే ఇష్టం కావడంతో అందుకు తగిన విధంగా శ్రీరెడ్డి కూడా తన బాడీ షేప్ మార్చుకుంటోంది.


Click it and Unblock the Notifications











