నా గతాన్ని తవ్వొద్దు: బాయ్‌ఫ్రెండ్ గురించి శ్రీరెడ్డి రిక్వెస్ట్
చెన్నైలో సెటిలైన శ్రీరెడ్డి ప్రస్తుతం అక్కడ పలు తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి మకాం మార్చిన అనంతరం చెన్నైలో ఓ ఇంటిని సైతం అద్దుకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు.
ఇపుడు చేతిలో సినిమా అవకాశాలు, తనకు నచ్చిన విధంగా జీవితం సాగుతుండటంతో శ్రీరెడ్డి సంతోషంగా ఉన్నారు. అయితే బాయ్ ఫ్రెండ్ లేని లోటు మాత్రం ఆమెను కాస్త అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్టు పెట్టింది.

బాయ్ ఫ్రెండ్ కోసం రిక్వెస్ట్
చెన్నై వచ్చాక సినిమా అవకాశాలతో పాటు చాలా ఇచ్చావ్.... కానీ బాయ్‌ఫ్రెండ్‌ను మాత్రం ఇవ్వలేదు... ఆ లోటును కూడా పూడ్చు దేవుడా అంటూ ఆమె ప్రార్థించినట్లు శ్రీరెడ్డి వెల్లడించారు.

నా గతాన్ని తవ్వొద్దు
నాకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాను. నా గత జీవితాన్ని తవ్వకుండా, నా బాధ్యత తీసుకునే ఒక మంచి వ్యక్తి కావాలి. అదే సమయంలో నా కోసం సమయం కేటాయించేవాడు అయుండాలి అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

చెన్నైకి చెందిన వాడే కావాలి
ఈ సందర్బంగా శ్రీరెడ్డి తనకు చెన్నైకి చెందిన అబ్బాయే బాయ్ ఫ్రెండుగా కావాలని వ్యాఖ్యానించడం గమనార్హం. మరి శ్రీరెడ్డి కోరుకున్న లక్షణాలతో ఆమెకు బాయ్ ఫ్రెండుగా ఉండటానికి ఎవరు ముందుకు వస్తారో చూడాలి.
Recommended Video


శ్రీరెడ్డి సంచలనం
కాగా... శ్రీరెడ్డి మరోసారి తమిళ ఇండస్ట్రీలో సంచలనాలకు తెరలేపింది. నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలిలో కీలకమైన పొజిషన్లో ఉన్న ఓ హీరోను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు. అతడు హీరోయిన్లతో పాటు సైడ్ యాక్టర్లను కూడా లైంగికంగా వేధిస్తుంటాడని, నిర్మాతల మండలిలో తనకు ఉన్న అధికారంతో చిన్న నిర్మాతలను డబ్బు కోసం వేధిస్తున్నాడని, త్వరలోనే అతడి నిజస్వరాన్ని ఆధారాలతో బయట పెడతాను అని శ్రీరెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











