కుర్ర హీరోలు వెంటపడినా.. అంకుల్ ఏజ్ ఉన్న బోనీ కపూర్‌ను Sridevi ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా?

అతిలోక సుందరి అందాల తార దివంగత శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ముసలి వాళ్ల దగ్గర నుంచి నేటి కుర్రాళ్ల వరకు ఆమె ఓ అందాల తారగా కనిపిస్తుంది. అయితే నేడు ఆమె 60వ జయంతి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అందాల రాశి అయినటు వంటి శ్రీదేవి వెంట ఎంతో మంది కుర్ర హీరోలు వెంటపడినా... ఆమె మాత్రం బోనీ కపూర్ ను మాత్రమే పెళ్లి చేసుకుంది. దాని వెనుక ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుతం కాలంలో పాన్ ఇండియా హీరోలు, హీరోయిన్స్ అని ఉండేవి కానీ... ఆనాటి కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది శ్రీదేవి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకుంది శ్రీదేవి. ఆమె దక్షణాది చిత్ర పరిశ్రమలోనే కాదు.. నార్త్ లోనూ ఓ ఊపు ఊపేసింది. ఇండియా వైడ్ స్టార్ డం అయితే తెచ్చుకుంది శ్రీదేవి.

 Sridevi Birthday

అయితే నేడు (ఆగస్టు 13) అతిలోకసుందరి శ్రీదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అంతే కాదు ఆమెకు ప్రముఖుల నుంచి.. సామాన్యుల వరకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులు బోనీ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు శ్రీదేవిని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెట్టగా.. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.

అయితే శ్రీదేవిని.. దివినుంచి భువికి దిగివచ్చిన అతిలోకసుందరిగా అందరూ కొనియాడేవారు. ఆమె హీరోల కంటే ఎక్కువ క్రేజ్ అయితే సంపాదించుకుంది. తెలుగు,తమిళ. కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటంలేని మహారాణిగా కొనసాగింది. ప్రేక్షకులందరూ ఆమెను అతిలోక సుందరి అని అంటూ పిలుచుకున్నారు. 1980లలో శ్రీదేవి ఇండియా వైడ్ గా భాషతో సంబంధం లేకుండా ఎంత తన హవా కొనసాగించింది.

 Sridevi Birthday

అయితే అంతటి క్రేజ్ ఉన్న శ్రీదేవిని ఎంతో మంది అప్పటి కుర్ర హీరోలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. శ్రీదేవి వాళ్ల అమ్మ సైతం కొంత మంది స్టార్ హీరోలతో మాట్లాడారని వార్తలు వచ్చాయి. అయితే ఎంతో మంది కుర్ర హీరోలు వెంట పడినా... ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా... అంకుల్ ఏజ్ ఉన్న బోనీ కపూర్ నే శ్రీదేవి ఎందుకు ప్రేమించింది.. ఆయననే ఎందుకు ప్రేమించింది.. అనే ప్రశ్నల వెనుక ఓ బలమైన రీజన్ ఉందట. ఈ విషయం చాలా మందికి తెలియక పోవచ్చు.

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి... అప్పుడు నిర్మాతగా ఉన్న బోనీ కపూర్ సినిమాల్లో నటించింది. అంతే కాదు.. కెరియర్ డౌన్ గా పరిస్థితుల్లో బోనీ కపూర్ తనకు అండగా నిలబడ్డారని సమాచారం. నేనున్నానంటూ ఓ భరోసాను ఇవ్వడం.. ఆమెకు అన్నింట్లో తోడుగా ఉండటంతో.. శ్రీదేవి బోనీ కపూర్ తో ప్రేమలో పడిందట. అప్పటికే బోనీ కపూర్ కు పెళ్లై పిల్లాడు (అర్జున్ కపూర్ ) కూడా ఉన్నాడు. ఇక మొదటి భార్య చనిపోడవంతో.. శ్రీదేవి.. బోనీ కపూర్ తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

 Sridevi Birthday

దీనితో శ్రీదేవి వెంట ఎంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు పడినా... చివరకు బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు సంతానం కూడా. వాళ్లే జాన్వీ కపూర్, ఖుషి కపూర్. ఇక జాన్వీ కపూర్ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. క్రేజ్ సంపాదించుకోవడానకిి తెగ కష్టపడుతుంది. ఈ భామ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనైనా ఆమె స్టార్ డమ్ మారుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X