twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కనే మించిపోయిన చెల్లి.. రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు!

    |

    అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు నెమ్మదిగా బాలీవుడ్ ని ఆకర్షిస్తున్నారు. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం దఢక్ ఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అక్క బాటలోనే చెల్లెలు ఖుషి కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఖుషి కపూర్ నటన పట్ల ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖుల కంట్లో పడేందుకు అందాల ఆరబోత మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

     ఈషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌

    ఈషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌

    ఇటీవల ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుక ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అతిరథ మహారథులు, బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. స్టార్ హీరోయిన్లని సైతం పక్కకు నెడుతూ ఈ వేడుకలో ఖుషి కపూర్ గ్లామరస్ అవతారం హైలైట్ గా నిలిచినట్లు తెలుస్తోంది.

    సిల్వర్ డ్రెస్‌లో మెరుపులు

    సిల్వర్ డ్రెస్‌లో మెరుపులు

    ఈ వేడుకలో ఖుషి కపూర్ ధరించిన డ్రెస్ చూస్తే కుర్రాళ్ల మతిపోవడం ఖాయం. సిల్వర్ డ్రెస్ లో అంతలా అందాలు ఆరబోసింది ఈ భామ. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

     నటిగా బిజీ కావాలని

    నటిగా బిజీ కావాలని

    కేవలం ఎంగేజ్ మెంట్ పార్టీలోనే కాకుండా ఖుషి తన గ్లామర్ లుక్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కుతున్నాయి. అక్క తరహాలోనే తాను కూడా నటిగా బిజీ కావాలని ఖుషి కపూర్ ప్రయతిస్తోంది.

    కెరీర్ కోసం

    కెరీర్ కోసం

    తమ తల్లి శ్రీదేవి మరణంతో డీలా పడిపోయిన జాన్వీ, ఖుషి ఇప్పుడిప్పుడే తేరుకుని కెరీర్ పై దృష్టి పెడుతున్నారు. జాన్వీ కపూర్ తదుపరి ఎలాంటి చిత్రంలో నటిస్తుందనే ఆసక్తి నెలకొని ఉండగా, ఖుషి కపూర్ తన నటనా ప్రస్థానం ఎప్పుడు ప్రారంభిస్తుందో చూడాలి.

    English summary
    Sridevi And Boney Kapoor’s Daughter Khushi Kapoor Looks Ravishing in Shimmery Gown. Khushi Kapoor is also glowing with Bollywood glamour in these pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X