బికినీ వేసినా ఇంత హాట్ గా కనిపించలేదు.. శ్రీదేవి కూతురు స్టన్నింగ్ లుక్
శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆమె మరణించిన తర్వాత ఆమె వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా అదే తరహాలో క్రేజ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ బ్యూటీకి సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ గ్లామర్ ప్రపంచంలో మాత్రం ఆదరణ గట్టిగానే దక్కుతోంది.

వరుసగా ఫ్లాప్స్
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా ఉన్న వారిలో జాన్వి కపూర్ కూడా టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి. దడఖ్ సినిమాతో బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన జాన్వీ ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లను అందుకోక పోయినప్పటికీ కూడా తన బ్యాక్ గ్రౌండ్ తో కొన్ని మంచి అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో కూడా ఆమెకి ఫ్లాప్స్ ఎదురయ్యాయి.

గ్లామర్ ప్రపంచంలో..
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ గ్లామర్ ప్రపంచంలో మాత్రం తనకు ఎవరు పోటీ లేరు అనే విధంగా అడుగులు వేస్తోంది. ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొన్ని రోజులకే అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందులో హాట్ నెస్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడుతోంది.

మరోసారి హాట్ స్టిల్
ఆఖరికి ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించినా కూడా జాన్వీకపూర్ ఏదో ఒక హాట్ పోజు తో కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ మెరిసేటి డ్రెస్ లో కూడా షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. గతంలో ఇలాంటి ఎన్నో క్లోవెజ్ ప్రదర్శనలు చేసినప్పటికీ జాన్వీ కపూర్ ఈసారి అంతకుమించి అనేలా హాట్ స్టిల్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది అని కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కంటే ఎక్కువ డోస్
జాన్వీ కపూర్ క్లివేజ్ షో తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో ఆమె చాలాసార్లు బికినీలో కూడా కనిపించిన జాన్వీ ఈ లుక్ లో మామూలుగా లేదు అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. జాన్వికపూర్ తప్పకుండా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకుంటుంది అని అభిమానులు కూడా చెబుతున్నారు.
Recommended Video

సినిమాలతో బిజీబిజీగా..
ఇక జాన్వికపూర్ ప్రస్తుతం కొన్ని మంచి సినిమాలతో బిజీగా మారింది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరో రెండు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దోస్తానా సీక్వెల్ కూడా సెట్స్ పైకి వచ్చేసింది. గుడ్ లక్ జెర్రీ, సినిమాతో పాటు మిలి అనే మరొక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలన్నీటిలో కూడా జాన్వికపూర్ వీలైనంత ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కనిపించనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











