తెలుగు గడ్డపై శ్రీదేవి కూతురు.. తల్లికి ఇష్టమైన దైవసన్నిదిలో అలాంటి డ్రెస్.. అందరూ షాక్!
టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లలో ఒకరైన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందంలో అయినా నటనలో అయినా ఆమెకి ఆమెనే పోటీగా నిలిచేవారు. అయితే ఆమె మరణించిన తరువాత కూతురు జాన్వీ కపూర్ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే రీసెంట్ గా జాన్వీ కపూర్ ఆంధ్రప్రదేశ్ లో దర్శనమిచ్చింది. ఆమె గుడిలో ఎవరు ఊహించని విధంగా బ్యూటీఫుల్ గా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. కొంతసేపు ఆమెను జాన్వీ అని కూడా ఎవరు అనుకోలేదు.

బాలీవుడ్ లో బిజీగా..
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీ గా మారుతోంది. ఆమె మొదట చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఇంకా సక్సెస్ అవ్వలేదు. కానీ తన నటనతో మాత్రం నిత్యం సినీ ప్రముఖులను ఆకర్షిస్తూనే ఉంది. మొదటి సినిమా తల్లి చేతులమీదుగానే మొదలయినప్పటికీ ఆ సినిమా విడుదలయ్యే లోపే శ్రీదేవి మరణించింది.

తిరుపతిలో జాన్వీ
జాన్వి కపూర్ వీలైనంతవరకు గ్లామర్ సినిమాలకంటే కూడా పాత్రలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటోంది. ఈ బ్యూటీ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. అయితే జాన్వి కపూర్ చాలా కాలం తర్వాత తెలుగు నేలపై కనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమె ప్రత్యేక దర్శనం చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతునాయి. మొదట విఐపి దర్శనం లైన్లో నిలబడిన జాన్వికపూర్ ఎవరికీ కనిపించకుండా మొహానికి మాస్క్ కూడా వేసుకోవడంతో జనాలు అంతగా గుర్తించలేదు.

హాఫ్ శారీలో జాన్వీ
ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్లామర్ బ్యూటీ గా గుర్తింపు పొందిన జాన్వికపూర్ ఒక్కసారిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.
సౌత్ ఇండియన్ అమ్మాయిగా సాంప్రదాయకంగా హాఫ్ శారీలో నిండు ఆభరణాలు ధరించింది. ముసుగుతో ముఖాన్ని దాచేసిన ఈ యువ నటి అందరి దృష్టిని ఆకర్షించింది. స్నేహితురాలితో కలిసి వచ్చిన జాన్వీ రంగనాయకుల మండపంలో అర్చకుల నుంచి ప్రసాదం కూడా స్వీకరించారు. శ్రీదేవి తరచు తిరుమల దేవస్థానంకు వస్తుండేవారు. ఇక అదే తరహాలో జాన్వీ కూడా తల్లికి ఇష్టమైన దైవాన్ని దర్శించుకుంటోంది.

తెలుగు ఆఫర్స్..
నిత్యం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డ్రెస్ లలో తిరిగే జాన్వీకపూర్ ఒక్కసారిగా అలా తెలుగు అమ్మాయిలా కనిపించడంతో ఓ వర్గం ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇక ఇలాంటి ట్రెడిషనల్ పాత్రలు చేస్తే కూడా జాన్వీ కపూర్ కి కరెక్ట్ గా సెట్ అవుతాయి అని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జాన్వీకి కొన్ని తెలుగు ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఆమెకు ఆ కథలు అనుకున్నంత స్థాయిలో నచ్చకపోవడంతో వాటిని రిజెక్ట్ చేసింది.

సినిమాల విషయానికి వస్తే..
ఇక జానకి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. మరోసారి ఆమె కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం దోస్తానా సీక్వెల్ సిద్ధమవుతుండగా గుడ్ లక్ జెర్రీ సినిమా పూర్తయింది. అంతేకాకుండా లిల్లీ అనే మరొక సినిమాను కూడా పూర్తి చేసింది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులకు కూడా ఓకే చేసేందుకు ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











