తిరుమలలో శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషీ... నో మేకప్, ఎవరూ గుర్తుపట్టలేదు! (ఫోటోస్)
Recommended Video

అతిలోక సుందరి, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో మంగళవారం తెల్లవారు ఝామున తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. అయితే ఎలాంటి మేకప్ హంగులు లేకుండా అచ్చ తెలుగు అమ్మాయిలా చీరకట్టులో దర్శనానికి రావడంతో చాలా మంది ఆమెను వెంటనే గుర్తు పట్టలేదు.
వారితో పాటు తండ్రి బోనీ కపూర్ కూడా రావడంతో.. క్యూలైన్లో ఉన్న ఇతర భక్తజనం వీరు శ్రీదేవి కూతుళ్లే అనే నిర్దారణకు వచ్చారు. వీరి తిరుమల దర్శనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

శ్రీదేవిని చూసినట్లే ఉంది
జాహ్నవి కపూర్‌ను అచ్చ తెలుగు అమ్మాయిలా చీరకట్టులో చూడటంతో పలువురు తెలుగు సినీ అభిమానులు శ్రీదేవిని చూసినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తండ్రితో కలిసి
తండ్రి బోనీ కపూర్‌తో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన జాహ్నవి కపూర్... ఎంతో నిర్మలంగా, సంతోషంగా కనిపించారు. 2018లో నటిగా తెరంగ్రేటం చేసిన జాహ్నవి ఈ నూతన సంవత్సరం తన కెరీర్లో మరింత ఎదుగుదల సాధించాలనే ఆత్మవిశ్వాసం ఆమెలో కనిపిస్తోంది.

సోదరికి తానే తల్లినై
శ్రీదేవి మరణించిన తర్వాత తన సోదరి ఖుషీ కపూర్ బాధ్యతలను జాహ్నవి చూసుకుంటున్నారు. ప్రస్తుతం జాహ్నవి కపూర్ ‘తక్త్', ‘రణ్ భూమి' సినిమాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలు 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఖుషీ కపూర్
శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా నటన వైపు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఆమెను వెండితెరకు పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











