శ్రీదేవి ముద్దుల కూతురు తన బాయ్‌ఫ్రెండ్ పేరును ఎక్కడ రాయించుకుందో తెలుసా?
Khushi Kapoor: అతిలోకి సుందరి శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వారి సినిమాలు, పార్టీలు, డేటింగ్, అఫైర్ వంటి ఏదో టాపిక్ తో వార్తలల్లో హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ఇందులో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో దేవరతో సక్సెస్ అందుకుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారింది. ఇక అమ్మడు డేటింగ్ వ్యవహారం మీడియాలో సెన్సేషన్‌కుగా మారితే.. తాజాగా తన చెల్లెళ్లు ఖుషీ కపూర్ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ పేరుకు సంబంధించి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకెళ్తే..
నాటి అందాల నటి శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల ముద్దుల కూతురు ఖుషీ కపూర్. ఈ అమ్మడు కూడా వరుస సినిమాలతో బాలీవుడ్ ను ఏలుతోంది. అయితే.. ఈ ముద్దుగుమ్మ డేటింగ్ వార్తలు సంబంధించిన రోజులుగా చాలా రోజులుగా వస్తున్నాయి. కానీ, ఈ వార్తలపై ఆమె ఎప్పుడు కూడా స్పందించలేదు. ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అయితే తాజాగా ఖుషీ కపూర్ కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫోటో అంత ప్రత్యేకత ఏముందని భావిస్తున్నారా?

వైరల్ అవుతున్న ఫోటోలో ఖుషీ కపూర్ తన తన బాయ్‌ఫ్రెండ్ పేరును బయటపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ వేదాంగ్ రైనా పేరు ఉన్న బ్రేస్లెట్ ను ఆమె వేసుకుంది. ఇప్పటికే ఖుషీ వేదాంగ్ పలుమార్లు కలిసి పబ్లిక్ గా కనిపించారు. కానీ వారిద్దరూ తన రిలేషన్ షిప్ మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ, ఇప్పుడిలా బాయ్ ఫ్రెండ్ పేరు ఉన్న బ్రేస్లెట్ ను వేసుకోవడంతో.. తన రిలేషన్ షిఫ్ ను బయటపెట్టినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. ఈ మధ్యనే ఈ లవ్ బర్డ్ మాల్దీవుల్లో వెకేషన్ కు వెళ్లింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఖుషీ కపూర్ రెడ్ బికినీలో కనిపించింది. ఆ సమయంలో ఆమె వేసుకున్న బ్రేస్‌లెట్ పై వేదాంగ్ రైనా పేరు కనిపించింది.
ఖుషీ కపూర్, వేదాంగ్ రైనా ఇద్దరు కలిసి ది ఆర్చీస్ మూవీలో నటించారు. అప్పటి నుంచే వీళ్ల మధ్య రిలేషన్ నడుస్తోందనే రూమర్స్ వచ్చాయి. ఇదే మూవీలో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా, మిహిర్ అహూజా కూడా నటించారు.

ఇదెలా ఉంటే.. ఖుషీ కపూర్ అక్క జాన్వీ కపూర్ ఇప్పటికే శిఖర్ పహరియాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అతని పేరును ఆమె తన నెక్లెస్ పై చూపిస్తోంది. అతడితో కలిసి ఆమె తిరుపతిలోని బాలాజీని పలుమార్లు దర్శించుకోవడం మీడియాలో హాట్ టాపికైంది. వారిద్దరూ పీకల్లోతుప్రేమలో ఉన్నారనే విషయం బాలీవుడ్ మీడియా పలు కథనాలు వెల్లడించాయి. ఈ బ్యూటీ జూనియర్ దేవర మూవీతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే..


Click it and Unblock the Notifications











