twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి లోకాన్ని వీడి ఏడాది.. ఫ్యామిలీ భావోద్వేగం.. ప్రథమ వర్ధంతి ఎక్కడంటే..

    |

    అలనాటి అందాల తార శ్రీదేవి మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలో ముంచింది. ఆమె మరో లోకానికి వెళ్లి అప్పుడే ఏడాది కావోస్తుంది. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి అనూహ్య పరిస్థితుల్లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మరణించడం అత్యంత విషాదంగా మారిన విషయం తెలిసిందే. శ్రీదేవి ప్రథమ వర్ధంతి రోజున నివాళులర్పించడానికి శ్రీదేవి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవీ ప్రథమ వర్ధంతిని ఎప్పుడు? ఎక్కడ చేస్తున్నారంటే..

     ఫిబ్రవరి 14న ప్రథమ వర్ధంతి

    ఫిబ్రవరి 14న ప్రథమ వర్ధంతి

    దివంగత శ్రీదేవి ప్రథమ వర్ధంతిని చెన్నైలోని తన నివాసంలో ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బోనికపూర్, జాహ్నవి, కుషీ కపూర్, అనిల్ కపూర్ సతీమణి సునీత, ఇతర కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక పూజలో వారు పాల్గొంటారు.

    సినీ ప్రముఖులు కూడా హాజరు

    సినీ ప్రముఖులు కూడా హాజరు

    శ్రీదేవి ప్రథమ వర్ధంతికి దక్షిణాది, హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. శ్రీదేవికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా ఈ పూజలో పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎవరు వస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేకపోయింది.

    చెన్నైతో శ్రీదేవికి అనుబంధం కారణంగా

    చెన్నైతో శ్రీదేవికి అనుబంధం కారణంగా

    చెన్నైలోని తన నివాసంతో గానీ, నగరంతో శ్రీదేవికి ఎమోషనల్‌గా బాండ్ ఉండేదని చెప్పుకొంటారు. అందుకే ఆమె తొలి వర్ధంతిని చెన్నైలో జరుపాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. అంతేకాకుండా శ్రీదేవి మరణం తర్వాత పింక్ చిత్రాన్ని తమిళంలోకి బోని కపూర్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    నా భార్య ఆక్షాంక్షలను నెరవేరుస్తానని

    నా భార్య ఆక్షాంక్షలను నెరవేరుస్తానని

    శ్రీదేవికి చెన్నై నగరంతో ఎంతో అనుబంధం ఉంది. తమిళ చిత్ర పరిశ్రమకు తిరిగి రావాలని కోరుకొనేది. కానీ విధిరాత వల్ల అది సాధ్యపడలేదు. నా భార్య ఆకాంక్షలను నెరవేర్చడానికే పింక్ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నాను. దీంతో శ్రీదేవి ఆత్మకు మరింత శాంతి చేకూరుతుందని భావిస్తున్నాం అని బోనికపూర్ పేర్కొన్నారు.

    తల్లి గురించి జాహ్నవి కపూర్

    తల్లి గురించి జాహ్నవి కపూర్

    శ్రీదేవి మరణంతో కూతురు జాహ్నవి కపూర్ తీవ్ర విషాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మ మరణం నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఆ చేదు నిజం నుంచి ఇంకా బయటపడటం ఇప్పట్లో సాధ్యం కాదు. నా తల్లి గురించి ఆలోచించడం తప్ప మరోటి తెలియదు అని జాహ్నవి కపూర్ పేర్కొన్నారు.

    English summary
    First death anniversary of Sridevi will be held on Feb 14th in Chennai. The legendary actor died in Dubai on February 24, 2018. A new DNA report says that the puja will be conducted at Sridevi’s Chennai home on February 14, and will be attended by Boney Kapoor and Sridevi’s daughters, Janhvi Kapoor and Khushi Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X