మతిపోగొట్టేలా... అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహం
అతిలోక సుందరిగా ఇటు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను అలరించారు దివంగత నటి శ్రీదేవి. అయితే గతేడాది శ్రీదేవి మరణం అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. కుటుంబ సభ్యులతో పాటు కొందరు అభిమానులు ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయట పడలేదు.
శ్రీదేవి లేని లోటు తీర్చలేనిది, దాన్ని పూడ్చడం అసాధ్యం. అయితే అభిమానులకు కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే... అచ్చం శ్రీదేవిని పోలిన మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ వారు తయారు చేశారు. దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ సంస్థ ఓ ప్రోమో విడుదల చేసింది.

శ్రీదేవి మైనపు విగ్రహాం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కృతం కాబోతోంది. ఇందుకు మరొక రోజు మాత్రమే సమయం ఉంది. ఇది చాలా అపూర్వమైన, మొదటి విగ్రహం. ఈ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ చేయబడుతుంది. తప్పకుండా చూండి అని ట్వీట్ చేశారు.
చిన్నతనంలోనే బాల నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన శ్రీదేవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యారు. దక్షిణాదిన ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడం, హిందీ చిత్ర సీమలో అడుగు పెట్టిన తర్వాత కూడా వరుస విజయాలతో దూసుకెళ్లడంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది.
తన కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నపుడే నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. తర్వాత కొన్నాళ్లకు 'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా నటించిన మూవీ 'మామ్'.


Click it and Unblock the Notifications











