ఆ హీరోని అందుకే కొట్టా... రిపోర్టర్ ప్రశ్నకు హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

చిత్ర పరిశ్రమలో చోటు చేసుకునే కొన్ని పరిణామాలు ఊహించని విధంగా వివాదాలుగా మారుతాయి. ఏళ్లు గడుస్తున్నా సరే వాటిని గుర్తు చేయడానికి మీడియా రెడీగా ఉంటుంది. ఇటీవలి కాలంలో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలు వివాదాలుగా మారుతున్నాయి. దాంతో స్టార్స్ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు విషయం పెద్దల వరకు వెళ్తున్నాయి. దాంతో మీడియా సమావేశాలకు రావాలంటేనే స్టార్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. తాజాగా ఓ హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది.

తెలుగు హీరోయిన్లకు దక్కని అవకాశాలు
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దొరకవన్నది బహిరంగ రహస్యం. అందం, అభినయం దండిగా ఉండి కూడా ఛాన్స్‌లు దొరక్క పక్కచూపులు చూస్తున్న అమ్మాయిలు ఎందరో. అంజలి, ఐశ్వర్య రాజేష్, శ్రీదివ్య వంటి వారు తెలుగులో అవకాశాలు దొరక్క తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ తమ ప్రతిభను నిరూపించుకుని స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. ఈ కోవలోకే వస్తారు శ్రీగౌరి ప్రియ. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈమెకు తమిళ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగులో అవకాశాలు రాలేదు.

Srigouri Priya Gives Strong Reply to Reporter s Question at Happy Raj Trailer Launch

మ్యాడ్ మూవీతో బ్రేక్
లవ్‌స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్‌తో పాటు పలు ఓటీటీ సినిమాలు చేసింది. అయితే టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రాకపోవడంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది ప్రియ. మోడరన్ లవ్ చెన్నై ఆమెకు తమిళంలో తొలి సినిమా. ఆ తర్వా ట్రూ లవర్‌తో సక్సెస్ అందుకుంది. ఈ దశలో మ్యాడ్ మూవీ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్‌స్టోరీ, సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న వింటావా సరదా సినిమాలు చేస్తోంది శ్రీగౌరి ప్రియ.

జీవీ ప్రకాష్‌ కుమార్‌కు హీరోయిన్‌గా
తాజాగా ఆమె హీరోయిన్‌గా నటించిన మూవీ హ్యాపీ రాజ్ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. మరియ రాజా ఎలెంజెయన్ దర్శకత్వం వహిస్తున్నారు. బియోండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవరదా నిర్మిస్తున్నారు. అబ్బాస్, జార్జ్ మర్యాన్‌ తదితరులు నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సెల్వ ఆర్కే ఎడిటింగ్, మదన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

తెలుగు హీరోలంటే ఎందుకంత కోపం
హ్యాపీ రాజ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ.. తెలుగు నుంచి తమిళంలోకి వెళ్లినందుకు సంతోషంగానే ఉందని చెప్పింది. మీరు తమిళ హీరోలతో చాలా రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తుంటారు సినిమాలలో.. తెలుగు హీరోలని మాత్రం కొడతారు సినిమాల్లో? తెలుగు హీరోలంటే ఎందుకు మీకు కోపం అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి శ్రీ గౌరి ప్రియ స్పందిస్తూ.. ఒకటే సినిమాల్లో కొట్టాను.. నేను ఏమైనా కంకణం కట్టుకున్నానా? అందరినీ కొట్టాలని. నాకు ఎవరి మీదా కోపం లేదు. అలాగైతే నేను అన్ని సినిమాల్లోనూ ఏడుస్తాను. తమిళ సినిమాల్లో అంతా ఏడుస్తుంది.. తెలుగు సినిమాలలో మాత్రం ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటారు. క్యారెక్టర్ ఎలా ఉంటే నేను అలా యాక్ట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. కాగా మ్యాడ్ సినిమాలో హీరో రామ్ నితిన్‌ని కొట్టే సీన్ యువతలో బాగా వైరల్ అయ్యింది. దీనిని దృష్టిలో పెట్టుకునే శ్రీ గౌరీ ప్రియను రిపోర్టర్ ప్రశ్నించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: movie news gv prakash kumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X