రావణుడిగా స్టార్ హీరో .. సీత పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్ , లవర్‌తో బాగోదంటూ
భారతీయుల ఇతిహాసం రామాయణం. ఎన్నిసార్లు చూసినా, విన్నా రామాయణంపై తనివి తీరదు. పితృ వాక్య పాలకుడిగా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించిన మహారాజుగా, రావణాసురిడిని వధించిన మహావీరుడిగా శ్రీరామచంద్రుడు ప్రజల గుండెల్లో పూజలు అందుకుంటున్నారు. యుగాలు గడిచినా, తరాలు మారినా రామాయణం తన ప్రాముఖ్యతను నిలబెట్టుకుంటూనే ఉంది. రాములోరు పూజలందుకుంటూనే ఉన్నారు.
సినిమాకు పనికొస్తుంది అనుకుంటే దర్శక నిర్మాతలు ఏ విషయాన్ని వదిలిపెట్టరు. దీనిలో భాగంగా టాలీవుడ్ టూ బాలీవుడ్ రామాయణం మీద లెక్కలేనన్ని సినిమాలు , వెబ్ సిరీస్, టెలివిజన్ సిరీస్‌లు నడిచాయి. అయినప్పటికీ రామాయణాన్ని ఇంకా తెరకెక్కిస్తూనే ఉన్నారు. దేశంలోని ఎంతో మంది డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం అంటే అతిశయోక్తి కాదు. కొద్దినెలల క్రితం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్‌తో ఓం రౌత్ ఆదిపురుష్ తీశారు. నెలలు గడవక ముందే బాలీవుడ్‌లో మరో రామాయణం సెట్స్ మీదకి వెళ్లింది.

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి సీతగా నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు నీతేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణాసురుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ రామాయణంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్, వీఎఫ్ఎక్స్ ఉంటాయని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది రామాయణ పార్ట్ 1, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయనున్నారు.
ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్ ముఖ్యంగా సీతగా సాయిపల్లవి లుక్ ఆకట్టుకుంది. అయితే కొందరు నెటిజన్లకు మాత్రం ఆమె ఆ పాత్రలో అంతగా సెట్ కాలేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనికి సాయిపల్లవి అభిమానులు అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దాదాపు రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ రామాయణలో సీతగా తొలుత ఎంపికైంది మరో నటి అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమె ఎవరో కాదు కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.
రామాయణలో సీత రోల్ కోసం మేకర్స్ తనను సంప్రదించడంతో స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లానని తన పర్ఫార్మెన్స్‌కు చిత్ర యూనిట్ కూడా సంతోషించిందని శ్రీనిధి తెలిపారు. అయితే ఇందులో యశ్ కూడా నటిస్తున్నారని తెలిసిందని.. కానీ అది ఏ పాత్ర అన్నది తెలియలేదన్నారు. దాంతో ఆయన రావణుడిగా, నేను సీతగా చేస్తే చూడటానికి అస్సలు బాగోదని అనిపించిందని శ్రీనిధి వెల్లడించారు.
ఎందుకంటే కేజీఎఫ్ సిరీస్‌తో మా జోడీకి మంచి పేరు వచ్చిందని.. అందులో ప్రేమించకున్న మమ్మల్ని రావణుడు, సీతగా జనం యాక్సెప్పట్ చేయలేరని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే సీతగా చేయనని ఆఫర్ తిరస్కరించానని.. కానీ ఈ రోల్‌కి సాయిపల్లవి సరిగ్గా సెట్ అవుతారని, ఆ రోల్‌లో ఆమెను చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లు శ్రీనిధి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మంచి నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











