ప్రేమ-రాక్షసత్వం ఒకే చోట ఉండగలవా?.. కేజీయఫ్ చాఫ్టర్ 2 నుంచి శ్రీనిధి శెట్టి పోస్టర్!
కన్నడ ఇండస్ట్రీలో మొదలైన యష్ ప్రస్థానం ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఒక్క కేజీయఫ్ సినిమాతో హీరోగా యష్, దర్శకుడిగా ప్రశాంత్ నీల్ నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వీరితో పాటు హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి షెట్టి కూడా బాగానే ఫేమస్ అయింది. కాకపోతే పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటం, మరీ అంత ప్రాముఖ్యమున్న పాత్ర కాకపోవడంతో నేషనల్ వైడ్ స్టార్డం మాత్రం రాలేదు.
కానీ కేజీయఫ్ చిత్రం మాత్రం రీనా పాత్రలో శ్రీనిధి శెట్టికి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. చాప్టర్ 2లో రీనా పాత్ర నిడివి ఎక్కువగానే ఉండోబోతోన్నట్టు తెలుస్తోంది. చాఫ్టర్ 2లో రాకీ భాయ్ రొమాన్స్ కూడా చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా శ్రీనిధి శెట్టికి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో శ్రీనిధి గెటప్ చూస్తుంటే రాకీ భాయ్‌కి ఇల్లాలిగా మారినట్టుంది.

ప్రేమ, రాక్షసత్తం ఒకేచోట ఉండగలవా? అంటూ వదిలిని పోస్టర్‌తో శ్రీనిధి పాత్ర చాప్టర్ 2లో ఎలా ఉండోబోతోందో అర్థం అవుతోంది. రాకీ భాయ్, రీనా పాత్రలు చాప్టర్‌లో మంచి రొమాన్స్ పండించేలానే ఉన్నాయి. మొత్తానికి ఐదారు నెలల తరువాత షూటింగ్ మొదలెట్టడం, అనారోగ్యంగా ఉన్నా కూడా సంజయ్ దత్ షూటింగ్‌లో జాయిన్ అవ్వడం మరో వైపు యష్ కూడా సెట్‌లో దుమ్ములేపుతుండటంతో కేజీయఫ్ చాప్టర్ 2 యూనిట్‌లో సందడి నెలకొంది.


Click it and Unblock the Notifications











