వాళ్లను తిడితేనే గుర్తింపా? శ్రీరెడ్డిపై మెగా ఫ్యాన్స్ ఫైర్. చిరు, పవన్‌ను టార్గెట్‌పై ఆగ్రహం
వివాదాస్పద నటి శ్రీరెడ్డి, మెగాస్టార్ ఫ్యామిలీకి మధ్య సోషల్ మీడియాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా కొద్దికాలంగా వివాదాలు నడుస్తున్నాయి. మెగా హీరోలను టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల కాలంలో హీరోయిన్లతోపాటు పవన్ కల్యాణ్, సైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నది. తాజాగా మరో వివాదాస్పద పోస్టును శ్రీరెడ్డి పెట్టడం మరింత ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..

జనసేన ఆవిర్బావ దినోత్సవం రోజున
కొద్దిరోజుల క్రితం జనసేన ఆవిర్బావ దినోత్సవం రోజున తనపై కొందరు చేస్తున్న విమర్శలపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను రాజకీయ నాయకుడిని కాబట్టి ఎవరేమైనా కామెంట్ చేసినా.. తిట్టినా భరించాల్సి వస్తున్నది. అదే సినీ హీరోను అయితే పరిస్థితి మరోలా ఉండేది అని పవన్ వ్యాఖ్యలు చేశారు.

పవన్‌పై ఘాటుగా
పవన్ చేసిన వాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ మిమ్నల్ని రాజకీయ నాయకుడని ఎవరన్నారు. ఆయనకు రాజకీయాలు చేయడం వచ్చా అనే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా సమయం సందర్భం దొరికితే పవన్‌ను కామెంట్ చేస్తుండటం గమనార్హం. తాజాగా ఆమె చిరంజీవిని టార్గెట్ చేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.

నాపై ప్రతీకారం తీర్చుకోవడం లేదేమో
గతంలో తాను రాజకీయ నాయకుడంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ శ్రీరెడ్డి సెటైర్లు వేసే ప్రయత్నం చేసింది. తాజాగా పవన్ కల్యాణ్ బహుశా రాజకీయ నాయకుడు కావొచ్చు. అందుకే నాపై ప్రతీకారం తీర్చుకోవడం లేదేమో అంటూ శ్రీరెడ్డి కామెంట్స్ చేశారు. ఈ విధంగా పవన్ కల్యాణ్‌ను వివాదంలోకి లాగాలా వద్దా అనే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది.

కానీ చిరంజీవి ప్రతీకారం తీర్చుకొంటున్నారంటూ..
అయితే మీ అన్న, లెజెండ్ చిరంజీవి మాత్రం నాపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. నాపై ఆయన ప్రతీకారం తీర్చుకొంటున్నారు. ఈ వ్యవహారమంతా ఫ్యామిలీ డ్రామాగా సాగుతున్నది అని శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Recommended Video

చిరంజీవి రెస్పాన్స్ ఎలా..
అయితే శ్రీరెడ్డి చేసిన కామెంట్లు మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. తనపై శ్రీరెడ్డి చేసిన కామెంట్లను చిరంజీవి ఎలా తీసుకొంటారో అనేది ఆసక్తిగా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తారా? లేక వాటిని గాలికే వదిలేస్తారా అనేది వేచి చూడాల్సిందే. అయితే మెగా హీరోల కంటే ముందుగా అభిమానులు మాత్రం స్పందించారు. పవన్, చిరంజీవినో టార్గెట్ చేయకపోతే నీకు గుర్తింపు ఉండదు. నీవు ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలి అంటూ నెటిజన్లు చాలా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











