twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య సినిమా కోసం శృతి హాసన్ హై డిమాండ్.. కెరీర్ లోనే మొదటిసారి హయ్యెస్ట్ రెమ్యునరేషన్!

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత అయితే కాస్త ఎక్కువగానే ఉందనే చెప్పాలి. మొన్నటి వరకు పూజా హెగ్డే రష్మిక మందన్న వంటి వారు అన్ని వర్గాల హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వారు కూడా పాన్ ఇండియా సినిమాల బాట పట్టడంతో ప్రస్తుతం ఇతర హీరోలకు అలాగే మరికొంతమంది సీనియర్ స్టార్ హీరోలకు కొత్త హీరోయిన్స్ దొరకాలి అంటే ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఒక విధంగా కొత్తవారిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కూడా కాస్త కష్టంగానే మారింది. బాలకృష్ణ 107 సినిమా కోసం కూడా హీరోయిన్ ని వేతకడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా చాలామందిని సంప్రదించాడు. ఫైనల్ గా శృతిహాసన్ అయితే సెలెక్ట్ అయింది.

     సెంటిమెంట్ సక్సెస్

    సెంటిమెంట్ సక్సెస్

    శృతిహాసన్ గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను కొందరు ఐరన్ లెగ్ అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం వరుస హిట్స్ తో ఆమె లక్కీ గర్ల్ గా మారుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రాక్ సినిమాతో కూడా ఆమె సక్సెస్ కొట్టి మరొకసారి లక్కీ సెంటిమెంట్ ను నిజం చేసింది.

    పాన్ ఇండియా ప్రాజెక్ట్

    పాన్ ఇండియా ప్రాజెక్ట్

    క్రాక్ సినిమా సక్సెస్ కావడంతో శ్రుతి హాసన్ కు గ్యాప్ లేకుండా టాలీవుడ్ నుంచి అనేక రకాల ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ ఆమె ఏ మాత్రం తొందర పడకుండా కేవలం తనకు సెట్ అయ్యే సినిమాలను మాత్రమే చేయాలని ఫిక్స్ అయింది. ఇక ఇప్పటికే ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా సక్సెస్ అయితే శృతి హాసన్ స్థాయి కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెరుగుతుంది అని చెప్పవచ్చు.

    దర్శకుడిపై నమ్మకంతో..

    దర్శకుడిపై నమ్మకంతో..

    ఇక గోపీచంద్ మలినేని మరొకసారి ఆమెతో సినిమా చేయాలని బాలకృష్ణ 107వ సినిమా కోసం సంప్రదించాడు. ఆమె మొదట్లో కొంత ఆలోచించినప్పటికి ఆ తర్వాత గోపీచంద్ తో ఉన్న మంచి సాన్నిహిత్యంతో సినిమా చేసేందుకు వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే ఇది వరకే ఈ దర్శకుడితో బలుపు అనే సినిమా కూడా చేసింది. ఇక క్రాక్ సినిమా అనంతరం బాలకృష్ణ సినిమా కూడా చేసేందుకు బాగానే ఒప్పుకుంది. ఒక విధంగా గోపిచంద్ పై నమ్మకంతో కూడా శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పవచ్చు.

    Recommended Video

    NBK107: Nandamuri Balakrishna's Next Grand Launch
    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    బాలకృష్ణ 105వ సినిమా కోసం శృతి హాసన్ రెమ్యునరేషన్ ఏ స్థాయిలో తీసుకుంది అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె ఫామ్ లో ఉంది కాబట్టి ఇతరులు కూడా ఆమెతో నటించాలని కోరుకుంటున్నారు. ఇక శృతి హాసన్ అయితే ప్రస్తుతం బాలకృష్ణ సినిమాకు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఆమెకు అడిగినంత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇక మొదటి షెడ్యూల్ ను యూఎస్ లో మొదలు పెట్టనున్నారు.

    English summary
    Sruthi hasan remuneration for Nandamuri balakrishna 107 project,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X