Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గంటకు లక్ష అంటున్న శృతి హాసన్.. నిమిషం ఎక్కువైనా కష్టమే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హసన్. వకీల్ సాబ్ కోసం ఆభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా తొందరగా సినిమాలను పూర్తి చేస్తున్న పవర్ స్టార్ కి లాక్ డౌన్ కాస్త దెబ్బ కొట్టిందనే చెప్పాలి. లేకుంటే ఈపాటికే.. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ ఉండేది. ఇక వకీల్ సినిమా కోసం స్టార్ హీరోయిన్ కి స్ట్రాంగ్ రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
వకీల్ సాబ్..
బాలీవుడ్, తమిళ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన పింక్ కథ తెలుగులో వకీల్ సాబ్ గా రిలీజ్ కాబోతోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ మెయిన్ కథను మార్చకుండా అలాగే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా పవన్ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి.
శ్రుతి హాసన్ రాకతో..
షూటింగ్ స్టార్ట్ కావడంతో చిత్ర యూనిట్ తో త్వరలో శ్రుతి హసన్ కూడా జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. మెయిన్ గా ఇందులో హీరోయిన్ కి సంబంధించిన పార్ట్ ఎక్కువగా పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసం శ్రుతి హాసన్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుందట. ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్ కి సంబంధించిననొక విషయం హాట్ తాపీక్ గా మారింది.
గంట ఎక్కువైనా..
శ్రుతి హాసన్ రెమ్యునరేషన్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని కోలీవుడ్ మీడియాలో ఒక టాక్ ఉంది. గంట ఎక్కువైనా పేమెంట్ పెంచేస్తుందనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా కోసం 7రోజుల పాటు డేట్స్ ఇచ్చిన అమ్మడు 60 నుంచి 70లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోదట.
Recommended Video
ఈ సినిమాతో అయినా..
సాధారణంగా శ్రుతి రెమ్యునరేషన్ ఒక సినిమాకు కోటి వరకు తీసుకుంటుందని టాక్. ఇక వకీల్ సాబ్ కోసం 7రోజుల కాల్షీట్స్ కాబట్టి రోజుకు 10లక్షల వరకు డిమాండ్ చేస్తోందట. షూటింగ్ తొందరగా ఫినిష్ చేయాలి కాబట్టి ఒక రోజులో 10గంటలు వర్క్ చేయడానికి ఓప్పుకుందట. అంటే అమ్మడికి గంటకు లక్ష అందుతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఈ సినిమాతో అయినా శ్రుతి మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.