కన్యత్వం ఒక్క రాత్రితో పోతుంది.. వర్జిన్ వైఫ్ వ్యాఖలపై ప్రియాంక చోప్రా క్లారిటీ
కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్స్ ఏం మాట్లాడినా.. ఏం చేసినా అది సమాజంపై ప్రభావం చూపుతుంది. కొందరు నటీనటులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతుంటారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుండగా.. వాటిపై ఈ డస్కీ బ్యూటీ వివరణ ఇచ్చింది. అసలు ప్రియాంక చోప్రా ఏం మాట్లాడింది? ఎందుకు ఆ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి? తాజాగా ఆమె దీనికి ఏం వివరణ ఇచ్చింది?ఈ వివరాల్లోకి వెళితే..
మిస్ వరల్డ్ నుంచి యాక్టర్‌గా
మిస్ట్ వరల్డ్ సాధించిన ఈ ముద్దుగుమ్మ.. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. టాప్ మోడల్‌గా వెలుగొందుతూనే సినీరంగ ప్రవేశం చేసిన ప్రియాంక చోప్రా.. తమిళ చిత్ర పరిశ్రమలో తొలుత తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కాలం కలిసి రాకపోవడంతో ముంబైలో అడుగుపెట్టి వరుస అవకాశాలను అందుకున్నారు ప్రియాంక. తన అందం, అభినయంతో అగ్రనటిగా వెలుగొందిన ప్రియాంక చోప్రా.. ఏకంగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. బాలీవుడ్‌లో స్టార్‌గా ఉన్నప్పుడే హాలీవుడ్‌లో అవకాశాలను అందుకుని ప్రపంచ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు ప్రియాంక చోప్రా.

SSMB29లో ప్రియాంక చోప్రా
తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయంలో విమర్శలు వచ్చినప్పటికీ వాటిని తిప్పికొట్టారు ప్రియాంక. ఆపై సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు. నిక్‌తో పెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడిన ఆమె .. లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 29లో ప్రియాంక చోప్రా కీలకపాత్ర పోషిస్తున్నారు.
కన్యత్వం ఒక్కరాత్రితో పోతుంది
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, తమ కుటుంబంలో జరిగే శుభకార్యాల విషయాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే జాతీయ , అంతర్జాతీయ విషయాలపైనా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ది బ్రీఫ్ ఇండియా అనే పేజీలో ప్రియాంక చోప్రా పేరుతో ఓ కథనం పోస్ట్ అయ్యింది. వర్జిన్ వైఫ్స్‌ని వెతకొద్దని.. మంచి గుణాలు, ప్రవర్తన ఉన్న స్త్రీని చేసుకోండి? ఎందుకంటే కన్యత్వం అనేది ఒక్క రాత్రిలోనే పోతుందని.. కానీ సభ్యత, సంస్కారం అనేవి జీవితాంతం ఉంటాయన్నది ఆ కథనం ఆ సారాంశం. దీంతో అప్పట్లో ఈ పోస్ట్ సినీ వర్గాల్లో కలకలం రేగగా.. నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ కథనంపై ప్రియాంక చోప్రా స్పందించారు. వీటిని తాను చేయలేదని.. ఈ టెక్ యుగంలో ఇలాంటి తప్పుడు కథనాలు వైరల్ కావడం సర్వసాధారణమని ఆమె తేల్చేశారు.
ఆ వ్యాఖ్యలపై ప్రియాంక క్లారిటీ
వర్జినిటీ వ్యాఖ్యలకు స్పందించిన స్క్రీన్ షాట్స్‌ను పంచుకున్న ప్రియాంక చోప్రా ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో దీనిని సృష్టించి వైరల్ చేశారని, పబ్లిసిటీ కోసం ఇలాంటి నిరాధార వార్తలను సృష్టించడం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ తరహా వార్తలను నమ్మడానికి ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని ప్రియాంక చోప్రా సూచించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











