స్కూల్ దశలోనే వేధింపులు.. ఎంత తగ్గినా కామెంట్ చేస్తూనే ఉన్నారు: సోనాక్షి సిన్హా
ఇటీవల కాలంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ద్వారా సినిమా ఇండస్ట్రీలో వారసులు ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అందులో సోనాక్షి సిన్హా ఒకరు. దబాంగ్ సినిమాతో డైరెక్ట్ గా స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కేవలం సిన్హా వారసత్వం వల్లే అవకాశాలు అందుకుంటోంది అనే కామెంట్స్ వచ్చాయి. ఇక సుశాంత్ మరణం తరువాత సోషల్ మీడియా కామెంట్స్ డోస్ పెరగడంతో దెబ్బకు ఇంటర్నెట్ ప్రపంచాన్ని దూరం పెట్టేసింది.

నాకు కూడా అవమానాలు తప్పలేదు..
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అని వివరణ ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసిందట. ముఖ్యంగా ఆమె ఫిట్నెస్ పై చాలా మంది కామెంట్ చేసేవారని బరువు తగ్గినప్పటికీ కూడా అవమానాలు తప్పలేవని తెలిపింది. సోనాక్షి ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక్కసారిగా నెటీజన్స్ ఆశ్చర్యపోయారు. మరోసారి ట్విట్టర్ లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది.

90కిలోల బరువు ఉంటే..
సోనాక్షి స్కూల్ లో చదువుకునేటప్పుడే దాదాపు 95కిలోల బరువు ఉండేదట. ఒకానొక సమయంలో 100కిలోలకు దగ్గరవుతున్న సమయంలో కష్టపడి 90లోనే ఉండేలా జాగ్రతపడిందట. అయితే మొదటి సినిమా దబాంగ్ కోసం మునుపెన్నడు లేనంతగా బరువు తగ్గినట్లు చెప్పిన ఈ బ్యూటీ అదే తన మొదటి విజయంగా బావిస్తానని అంటోంది.

ఎగతాళి చేస్తున్నారు..
అంటే దాదాపు 30కిలోల బరువు తగ్గడంతో నాకు చాలా ఆనందం వేసింది. నాకు అవమానాలు కొత్తేమి కాదు. స్కూల్ లో ఉన్నప్పటి నుంచే నా బరువుపై ఎగతాళి చేసే విధంగా కామెంట్స్ చేసేవారు. ఇక సినిమాల్లోకి వచ్చిన తరువాత దాదాపు 70కిలోలకు చేరుకున్నప్పటికి కామెంట్ చేసేవారు చేస్తూనే ఉన్నారు.

నెటీజన్స్ షాకింగ్ కామెంట్స్
బరువు విషయంలో నేను చాలా కాలంగా అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నాను అని సోనాక్షి సిన్హా తనదైన శైలిలో వివరణ ఇవ్వగా మారోసారి నెటీజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన నువ్వు నీ బరువు తగ్గడానికే అంతగా కష్టపడితే సుశాంత్ లాంటి వాళ్ళు అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించి ఇంకెంత కష్టపడుతూ ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











