సామజవరగమన హీరోయిన్‌పై మనసు పడ్డ స్టార్ హీరో.. ఏకంగా డేట్‌కు రమ్మంటూ..

శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన 'సామజవరగమన' చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళి భామ రెబ్బా మోనికా జాన్. ఈ చిత్రం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందింది. ఇక మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ... కుర్రకారుకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

మలయాళీ భామ రెబ్బా మోనికా జాన్... ఇటీవల సామజవరగమన చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అసలు ఈ ముద్దు గుమ్మ మొదట విజయ్ నటించిన బిగిల్ చిత్రంలో అనితా క్యారెక్టర్ చేసి ముందుగానే పరిచయం అయింది. అయితే ఆ సినిమా తమిళ్ కావడంతో.. తెలుగులో డబ్ అయింది. ఇక ఈ మూవీలో యాసిడ్ అటాక్ బాధితురాలిగా నటించి అందరినీ మెప్పించింది.

Heroine Reba Monica John

విజయ్ తో కలిసి నటించిన రెబ్బా మోనికా... తెలుగులో శ్రీవిష్ణుతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఇదిలా ఉంటే... మలయాళీ సుందరి రెబ్బా మోనికా జాన్‌.... మలయాళీ అయినా బెంగళూరులో పుట్టి పెరిగింది. మలయాళంలో నటించిన 'ఫొరెన్సిక్‌' చిత్రానికి ఆమెకు మంచి పేరొచ్చింది.

Heroine Reba Monica John

ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ మలయాళి భామ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఒక స్టార్ హీరో మిమ్మల్ని డేట్ కి రమ్మని పిలిచాడంట అంటూ యాంకర్ ప్రశ్నించగా... అవును అని స్ట్రేట్ గా సమాధానం ఇచ్చింది రెబ్బా మోనిక. అందులో తప్పేం ఉంది.. ఇట్స్ హప్పెన్స్ అంటూ కూల్ గా సమాధానం చెప్పింది. వాళ్లు పిలుస్తూంటారు అందులో ఏముంది.. అని చెప్పుకొచ్చింది.

ఇక యాంకర్ మీరు పాజిటివ్ మైండ్ అంటుండగా... అవును నేను పాజిటివ్ పర్సన్ అని వెల్లడించింది. తనను డేట్ కు ఎవరైనా రావొచ్చని హింట్ ఇచ్చింది. నేను సీరియస్ గా తీసుకోను... పాజిటివ్ గా ఉంటాను. నేను వివాదాల్లోకి వెళ్లను... అని చెప్పుకొచ్చింది. ఇక యాంకర్ గోవా వెళ్దామా అని అడగ్గా... నాకు డేట్స్ లేవు అంటూ వెల్లడించింది.

Heroine Reba Monica John

తలపతి విజయ్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. ఆ మూవీలో తన రోల్ బాగా నచ్చిందని తెలిపింది. వెరీ సింపుల్ గా విజయ్ నాతో ఉన్నారు. 40 డేస్ ఆయనతో కలిసి నటించానని చెప్పుకోచ్చింది. ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని వెల్లడించింది. ఇక బోర్ కొడితే గోవా, బెంగళూరు వెళతాను అని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X