ఆ ఒక్క సినిమాతో త్రిష కెరియరే మారిపోయిందిగా.. స్టార్ హీరోలంతా ఆమె కోసం క్యూలో!
త్రిష.. ఈ పేరు తెలియని వాళ్లు, ఈ ముద్దుగుమ్మ అందాలకు ఫిదా కాని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో దుమ్మ రేపిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటికీ హీరోయిన్ గానే కొనసాగుతోంది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ.. 1999లో సినీ రంగోలో అడుగు పెట్టింది. ఇప్పటికి 24 ఏళ్లుగా సినిమాల్లో రాణిస్తూ.. అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వయసు ఎంత పెరుగుతున్నా అందం తగ్గట్లేదు. అలాగే ఆమెకు అవకాశాల వెల్లువ కూడా రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఈమెకు.. అవాకాశాలు పెరిగిపోయాయి. చాలా మంది స్టార్ హీరోలు ఈమె డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. మా సినిమాలో నిన్నే తీస్కుంటామంటే, మా సినిమాలో నిన్నే తీసుకుంటామని అంటున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పొన్నియన్ సెల్వన్ సినిమాతో తన గ్రాప్ ను అమాంతం పంచెసుకున్న త్రిషకు... విశ్వంభర సినిమాలో అవకాశం దక్కింది. ఆ తర్వాత మరిన్ని సూపర్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో దర్శకుడు విష్ణువర్ధన్ రూపొందించబోయే ది బుల్ త్రిషనే తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే అజిత్ తో మిదాముయర్చి సినిమా చేస్తున్న విషంయ ఇప్పటికే అందరికీ తెలిసిందే.

ఇది మాత్రమే కాకుండా.. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ లో రామ్ సినిమాలో కూడా త్రిషనే తీసుకున్నారట. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రాబోతున్న థగ్ లైఫ్ సినిమాలోనూ ఛాన్స్ పట్టేసిందట. ఇలాగే ఐడెంటిటీ అనే మరో సినిమా కూడా నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసు కల్గిన ఈమెకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆమె అందం, అభినయమే. మరికొన్ని సంవత్సరాలు కూడా ఈమె హీరోయిన్ గానే సాగబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











