మన్మథుడు 2లో తెలివైన అమ్మాయిగా.. ఆసక్తికరంగా రకుల్ పాత్ర!
కింగ్ నాగార్జున త్వరలో నటించబోయే చిత్రం మన్మథుడు 2. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించబోతున్నారు. కథ మొత్తం సిద్ధం కావడంతో నాగ్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి తాజగా ఆసక్తికర వార్తలు వినిపిస్తన్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరగబోతోంది. మన్మథుడు చిత్రం కోసం ఇప్పటివరకు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ తెలివైన లక్షణాలతో ఉంటుందట. ఆ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ అయితే ఈ పాత్రకు బాగా సెట్ అవుతుందని దర్శకుడు భావించాడు. రకుల్ ప్రీత్ పాత్ర మన్మథుడు 2లో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. 2002లో వచ్చిన మన్మథుడు చిత్రంలో త్రివిక్రమ్ అందించిన మాటలు అందరిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాహుల్ రవీంద్రన్ త్రివిక్రమ్ స్థాయిలో అలరించగలడా లేదా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











