సీనియర్ హీరోయిన్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన రష్మిక.. దానికోసమే వెయిటింగ్!
సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రష్మిక మందన్న మెల్లగా తన స్థాయిని బాలీవుడ్లో కూడా పెంచుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం సౌత్ లో కూడా బిజీగా ఉన్నా ఈ బ్యూటీ వీలైనంత త్వరగా ముంబైకి షిఫ్ట్ అవ్వాలని కూడా ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆమె చేస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఏ మాత్రం హిట్టయినా ఆమె క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లడం ఖాయం అనే చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ అవసరమైతే చిన్న సినిమాల్లో కూడా నటించాలని అనుకుంటుంది. కేవలం కథ నచ్చితేనే చేస్తానని రెమ్యునరేషన్ తక్కువైనా కూడా పర్వాలేదు అనే విధంగా ఆలోచిస్తోందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువగా విభిన్నమైన కథల కోసం ఎదురు చూస్తోంది.
వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలను పక్కకు పెట్టాలని ఫిక్స్ అయ్యిందట. అలాగే కన్నడ సినిమాల వైపు కూడా ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. అవసరమైతే బయోపిక్ లో కూడా నటించాలని రష్మిక మందన ఎదురుచూస్తున్నట్లు ఇటీవల ఒక క్లాటిటి ఇచ్చేసింది. ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ వారికంటూ ఒక స్థాయి రాగానే బయోపిక్స్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. కీర్తి సురేష్ మహానటి సినిమా తో ఏ స్థాయిలో గుర్తింపు అందుకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా కూడా మహానటి సినిమా ఆల్ టైం బెస్ట్ హిట్ అని చెప్పవచ్చు. రష్మిక కూడా అదే తరహాలో ఏదైనా మంచి బయోపిక్ చేయాలని అనుకుంటోంది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సౌందర్య బయోపిక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలియజేసింది. అందుకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందట. చిన్నప్పుడు ఎక్కువగా తన తండ్రి సౌందర్య తరహాలోనే ఉన్నావని ప్రశంసల వర్షం కురిపించేవారట. ఆ విషయం తనలో బలంగా పాతుకుపోయినట్లు చెప్పినా రష్మిక మందన్న అవకాశం వస్తే తప్పకుండా సౌందర్య గారి బయోపిక్ లో నటిస్తానని తెలియజేసింది. ఆమె చేసిన సినిమాలు అలాగే మంచి పనులు కూడా తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తప్పకుండా అలాంటి వాళ్ల సినిమాల్లో నటిస్తే నటిగా ఎంతో సంతృప్తి ఉంటుందని చెప్పింది.
ఇక కన్నడ హీరోయిన్ అయినటువంటి సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతగానో మంచి గుర్తింపు అందుకుంది. మొదట ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ కూడా తెలుగు హీరోయిన్ అనుకున్నారు. స్టైలిష్ పాత్ర అయినా సరే ఒక భార్య పాత్రలో అయినా సరే సౌందర్య ఎంతగానో జీవించి నటించేది ఎక్కువగా చాలెంజింగ్ పాత్రలపై ఆమె ఫోకస్ పెట్టేది. హీరోల స్థాయిని కూడా లెక్కచేయకుండా కమెడియన్స్ తో కూడా ఆమె నటించింది. సౌందర్య కు కేవలం కన్నడ లోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌందర్య బయోపిక్ పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. మరి భవిష్యత్తులో ఎవరైనా ఆమె కథను వెండి తెరపైకి తెస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











