Samantha సమంత సెన్సేషనల్ గ్లామర్ షో: ఈ ఆరబోతకు 100 మార్కులు ఇవ్వాల్సిందే!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు స్టార్లుగా హవాను చూపించారు. కానీ, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా కూడా ప్రభావాన్ని చూపిస్తూ సెన్సేషన్‌గా మారారు. వారిలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఎన్నో భాషల్లో వరుసగా సినిమాలు చేసిన ఈ సుందరాంగి.. ఈ మధ్య కాలంలో మాత్రం స్పీడ్ తగ్గించేసిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తూనే వెళ్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత రూత్ ప్రభు కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి!

సమంతకు వరుస దెబ్బలు: కొంత కాలంగా పంథాను మార్చుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. గత ఏడాది వచ్చిన 'యశోద'తో బిగ్గెస్ట్ సోలో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసింది. అయితే, ఈ ఏడాది ఆమె నటించిన 'శాకుంతలం', 'ఖుషి' మూవీలు చేసింది. కానీ, ఈ రెండూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలనే చవి చూసేశాయి.

సమంత చేతిలో అదొక్కటే: కెరీర్ ఆరంభం నుంచీ సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్న సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు పెద్దగా మూవీలను చేయడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'సీటాడెల్' వెబ్ సిరీస్‌లో మాత్రమే ఉంది. ఇది మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీని కోసం ఆమె అభిమానులు అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

హెల్త్ పైనే ఎక్కువ ఫోకస్: చాలా కాలంగా సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపించే ఈ వ్యాధి కోసం ఈ భామ కొద్ది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సను కూడా తీసుకుంది. ఇప్పుడు కూడా వైద్యం చేయించుకుంటూ సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం సమంత ఆమె హెల్త్‌పైనే ఫోకస్ చేస్తోంది.
సోషల్ మీడియా ద్వారానే: దాదాపు దశాబ్దానికి పైగానే పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సమంత రూత్ ప్రభు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఈ స్టార్ హీరోయిన్ తన సినీ కెరీర్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా సినిమాలు లేకున్నా వాళ్లను ఖుషీ చేస్తూనే ఉంటోంది.
ఎక్కువగా అందాల జాతరే: హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో గ్లామర్ రోల్స్ చేసిన సమంత.. ఈ మధ్య కాలంలో మాత్రం డీసెంట్ పాత్రల్లోనే నటిస్తోంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలను వదులుతోంది. ఇటీవలి కాలంలో అయితే వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

హాట్ డ్రెస్‌లో సామ్ కిక్కు: కొద్ది రోజులుగా సమంత రూత్ ప్రభు తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్‌తో డిజైన్ చేసిన టాప్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో సమంత రూత్ ప్రభు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

భారీ స్పందన వస్తోందిగా: తాజాగా సమంత రూత్ ప్రభు షేర్ చేసిన బోల్డు పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కొందరు సెలెబ్రిటీలు, అభిమానులు ఆమె అందాలను విపరీతంగా పొగడుతూ సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం సమంతను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన ఫొటోలు అన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











