Taapsee Pannu: బ్లాక్ బికినీలో తాప్సి మెరిసే అందాలు.. మళ్ళీ షాక్ ఇచ్చిందిగా..
తాప్సీ పన్ను ఏది చేసినా సెన్సేషనే. తాప్సీ అందరు హీరోయిన్స్ లాగే తన కెరీర్ ని మొదలుపెట్టినా, ఆ తర్వాత తనకు నచ్చినట్లుగా మార్చుకుంది. టాలీవుడ్ లో తన కెరీర్ ని మొదలుపెట్టి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. తెలుగులో అమ్మడు మొదట్లోనే కాస్త గ్లామర్ తో స్టన్ అయ్యేలా చేసింది గాని ఎప్పుడు కూడా లిమిట్స్ దాటింది లేదు. అలాగని పూర్తిగా ట్రెడిషినల్ లుక్స్ లో కూడా కనిపించింది లేదు. వీలైనంత వరకు పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత అమ్మడు రోజురోజుకు డోస్ మరింత పెంచుతోంది. ఇక ఆమెకు సంబంధించిన మరో బికినీ లాంటి లుక్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సొట్ట బుగ్గల అందంతోనే: టాలీవుడ్ లో ఝుమ్మందినాదం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తాప్సి మొక్సట్లోనే యువతను ఎంతగానో ఆకట్టుకుంది. తన సొట్ట బుగ్గల అందంతోనే అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఇక ఆ సినిమాలో ముద్దుగా, బొద్దుగా క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. సన్నజాజి తీగలా మారిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు, సక్సెస్ రాలేదనే చెప్పాలి.

బాలీవుడ్ లో బిజీ హీరోయిన్: అందుకే తన మకాం మొత్తం బాలీవుడ్ కి మార్చేసింది. అక్కడ ఆమెకు ఉమెన్ సెంట్రిక్ కథలు వస్తున్నాయి.. ఆమె తన నటనతోనూ సినిమాలను హిట్ చేస్తోంది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఓటీటీలోనూ తాప్సీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. వరస హిట్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో తాప్సి బికినీ డోస్ పెంచినప్పటి నుంచి ఆఫర్ల సంఖ్య కూడా పెరిగింది.

వరుసగా వర్కౌట్స్ వీడియోలు: తెలుగులో అయితే ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి పడలేదు. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం లాంటి సినిమాలు ఆమెకు కొంత గుర్తింపు తీసుకు వచ్చాయి. ఇక తాప్సీ అయితే సోషల్ మీడియాలో తన వర్కౌట్ల వీడియోలు, అందాల ఆరబోతతో హంగామా చేస్తుంటుంది. ఫిట్నెస్ తో తన శరీరాన్ని ఎంత ధృడంగా మార్చుకుంది. ఇక తనపై ఎవరైనా కామెంట్స్ చేస్తే, వెంటనే వాటికి బదులు చెప్పడంలోనూ తాప్సీ ముందుంటుంది. ముఖ్యంగా ఆ మధ్య కంగనా తనపై కౌంటర్ వేస్తే, దానికి స్ట్రాంగ్ గా బదులు చెప్పింది. తనకు నచ్చినవి, నచ్చనవి కూడా నిర్మోహమాటంగా చెప్పేస్తూ, ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది..!

మరోసారి బికినీ అందాలతో..: ఈ హాట్ బ్యూటీ తాజగా బికినీలో దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్ బికినీలో తాప్సీ యమా హాట్ గా కనిపించడం విశేషం. తన ఉంగరాల జుట్టును స్వేచ్ఛగా వదిలేసి, నలుపు రంగు బికినీ కి, నలుపు రంగు జాకెట్ పెయిర్ చేసింది. అదే రంగు పొడవాటి బూట్లూ కూడా ధరించి సమ్మర్ లో మరింత హీట్ పెంచేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











