ఆ బడా నిర్మాతతోనే హీరోయిన్ త్రిష పెళ్లి.. బయటకు వచ్చేసిన అసలైన నిజం

చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటనతో సౌత్ ఇండియా మొత్తంలో ప్రభావాన్ని చూపిస్తూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది కోలీవుడ్ బ్యూటీ త్రిష. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోంది.

ఇలా ఇప్పటికీ తనదైన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజులుగా త్రిష పెళ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఈ స్టార్ హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

Star Heroine Trisha Krishnan Gives Clarity on Her Marriage

చిన్నప్పుడే మొదలెట్టింది
టీనేజ్‌లోనే త్రిష మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. తండ్రి లేకున్నా తల్లి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. గ్లామర్ ఫీల్డులో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని సత్తా చాటింది. ఫలితంగా అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపిక అయింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుని ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది.

Star Heroine Trisha Krishnan Gives Clarity on Her Marriage

స్టార్ హీరోయిన్‌గా ఎదిగేసి

'జోడీ' అనే సినిమాలో త్రిష చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన 'మౌనం పెసియాదే'లో హీరోయిన్‌గా మారింది. అనంతరం 'నీ మనసు నాకు తెలుసు' అనే ద్విభాషా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. 'వర్షం'తో మొదటి బ్రేక్‌ను అందుకుంది. అప్పుడే టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారి తనదైన రీతిలో హవాను చూపించింది.

Star Heroine Trisha Krishnan Gives Clarity on Her Marriage

అతడితో నిశ్చితార్థమైనా
త్రిష ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో వివాహం కుదిరింది. వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో వరుణ్.. త్రిషను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. దీని తర్వాత కూడా ఈ స్టార్ హీరోయిన్ కెరీర్‌ను కంటిన్యూ చేసింది.

ఇప్పుడా మూవీలతో బిజీ

త్రిష రేంజ్ సినిమాల్లోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా కూడా తగ్గలేదు. ఈ మధ్య కాలంలో ఆమె మరింత వేగంగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్‌తో 'లియో' చేసింది. అలాగే, 'ది రోడ్', 'విడా ముయార్చి', 'సత్తురంగా వెట్టై 2' వంటి తమిళ చిత్రాల్లో నటించింది. అంతేకాదు, 'రామ్ పార్ట్ 1', 'ఐడెంటిటీ', 'విశ్వంభర' మూవీలు సైతం చేస్తోంది.

Star Heroine Trisha Krishnan Gives Clarity on Her Marriage

హాట్ టాపిక్‌గా త్రిష పెళ్లి
సౌత్‌లోని హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నా.. త్రిష మాత్రం ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పలు ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి ఆమె ఎన్నో కామెంట్లు చేసింది. దీంతో ఈ మధ్య కాలంలో ఈ హీరోయిన్ పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తరచూ ఆమె వివాహం గురించి ఏదో ఒక న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోతోంది.

ఆ నిర్మాతతోనే అంటూ

త్రిష పెళ్లి గురించి కొద్ది రోజులుగా ఓ న్యూస్ సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో సెన్సేషన్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ బ్యూటీ త్వరలోనే మలయాళ పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను పెళ్లాడబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల క్రితం ఓ సినిమా చేస్తోన్న సమయంలో ప్రేమ చిగురించిందని అంటున్నారు. ఈ ఏడాదే పెళ్లాడబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Star Heroine Trisha Krishnan Gives Clarity on Her Marriage

క్లారిటీ ఇచ్చేసిన బ్యూటీ
తన పెళ్లి వార్తలపై తాజాగా త్రిష స్పందించింది. ఈ మేరకు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించిన ఇప్పటికే వార్తలు ఎక్కువ అయ్యాయి. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు రాస్తున్నారు. కానీ వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. నేను ప్రస్తుతం నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీకే ముందు చెప్తాను' అని తేల్చిపడేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X