మైండ్ బ్లోయింగ్.. అమలాపాల్ ఇంత బోల్డ్‌గానా.. కేక పెట్టిస్తున్న ఆడై ఫస్ట్ లుక్!
అమలాపాల్ ప్రస్తుతం విభిన్న కథలపై దృష్టిపెట్టినట్లుంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో మెప్పించిన అమల ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో దూసుకుపోతోంది. తాజాగా అమలాపాల్ అందరికి స్వీట్ షాక్ ఇచ్చింది. అమలపాల్ ప్రధాన పాత్రలో ఆడై చిత్రం తెరక్కుతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజగా విడుదలై అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
చిరిగిన దుస్తులతో అమలాపాల్ సగభాగం నగ్నంగా కనిపిస్తోంది. అలా అని ఇది గ్లామర్ లుక్ కాదు. బోల్డ్ గా కనిపిస్తున్న అమల ముఖంలో ఎమోషన్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఈ మధ్య కాలంలో ఇంత బోల్డ్ గా మారే హీరోయిన్ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.

టాలీవుడ్ హీరో రానా తన ట్విట్టర్ లో ఆడై ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే ఆసక్తి పెంచేసింది చెప్పొచ్చు. ఈ ఫస్ట్ లుక్ లో కళాత్మకత ఉట్టిపడుతోంది రానా ప్రశంసలు కురిపించాడు. రత్నకుమార్ దర్శత్వంలో ఈ చిత్రం తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











