ఫస్ట్ లుక్: సైరాలో తమన్నా.. కేక పెట్టిస్తున్న హాట్ లుక్!

Recommended Video

Tamannaah Look As Lakshmi In Sye Raa Narasimha Reddy | Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సురేందర్ రెడ్డి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అందరికి తెలియని ఈ వీరుడి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఇలాంటి తరహా చిత్రంలో నటించడం మెగాస్టార్ కు ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో భారీగా స్టార్స్ నటిస్తున్నారు. ఒక్కొక్కరి పుట్టిన రోజు సందర్భంగా వారి ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ పాత్రలని పరిచయం చేస్తున్నారు.

అందాల లక్ష్మిగా తమన్నా

నేడు మిల్కి బ్యూటీ తమన్నా పుట్టిన రోజు. తమన్నాకు యువతలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమన్నా బర్త్ డే సందర్భంగా సైరా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ విడుదుల చేసింది. తమన్నా పాత్ర పేరు లక్ష్మి. తమన్నా లుక్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. తమన్నా ధరించిన కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగానే తమన్నా హాట్ లుక్ లో అదరగొడుతుంది. ఈ లుక్ లో తమన్నా అందాలకు యువత ఫిదా కావడం ఖాయం.

 బాహుబలిలో

బాహుబలిలో

ఇప్పటికే బాహుబలిలో తమన్నా ఈ తరహా లుక్ లో కనిపించినా దేనికి అదే సాటి అని చెప్పొచ్చు. బాహుబలిలో తమన్నా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేసింది. అసలు లక్ష్మి ఎవరు.. తమన్నా పాత్ర వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే విషయం తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

 300 కోట్ల బడ్జెట్

300 కోట్ల బడ్జెట్

సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. జార్జియా లాంటి విదేశాల్లో కూడా ఈ చిత్ర కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండడం విశేషం.

నటీనటులు

నటీనటులు


సైరా నరసింహారెడ్డి చిత్రంలో భారీ తారాగణమే ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా ఇలా సైరా చిత్రం మొత్తం స్టార్ కాస్టింగ్ తో నిండిపోయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార చిరు సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి రచయితలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X