సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ తో చిక్కిన స్టార్ హీరో కుమార్తె.. ముఖాలు దాచుకోవడంతో కొత్త అనుమానాలు
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇంకా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్ట లేదు కానీ ఆమెకు సోషల్ మీడియాలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఆమె తన ఫోటోలను షేర్ చేసిన వెంటనే అవి వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఆమె ఫోటో పోస్ట్ చేయలేదు కానీ ఒక కుర్రాడితో కలిసి బయటకు వచ్చి కెమెరాల కంటికి చిక్కింది. ఎక్కడ మీడియాలో ప్రచారం జరుగుతుందో అనే భయంతో ముఖాలు దాచుకున్నారు ఆ ఇద్దరూ. ఆ వివరాలు

జోయా అక్తర్ సినిమాతో
షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉన్న అది ఎప్పుడు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. సుహానా ఖాన్ త్వరలో జోయా అక్తర్ సినిమాతో తెరంగేట్రం చేస్తుందని అంటున్నారు. అయితే ఈ భామ సినీ ఎంట్రీ కూడా ఇవ్వక ముందు నుంచే సుహానా సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తోంది.

ప్రేమలో పడిందనే
నిజానికి సుహానా ఖాన్ కొన్నేళ్ల క్రితం యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. వీరిద్దరూ పార్టీలని చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ప్రచారం జరిగినా, అదేమీ లేదని మేము స్నేహితులం మాత్రమే అని వాళ్ళు క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె మరో సారి ఈ ప్రేమ వ్యవహార మీద వార్తల్లోకి ఎక్కింది.

మిస్టరీ బాయ్‌తో కనిపించి
సుహానా ఖాన్ మిస్టరీ బాయ్‌తో కనిపించింది. మంగళవారం, సుహానా ఖాన్ తన మగ స్నేహితులలో ఒకరితో కనిపించింది. ఇద్దరూ కారులో కనిపించారు. వారిని ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయడం ప్రారంభించినప్పుడు సుహానా ఖాన్ తన ముఖాన్ని దాచుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత, షారుక్ ఖాన్ కుమార్తె సుహానాతో మొదటిసారిగా కనిపించిన స్నేహితుడు ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

మిస్టరీ బాయ్ ఎవరు ?
సుహానా, ఆమె స్నేహితుడు తమ ముఖాన్ని చేతులతో దాచుకున్న చిత్రాలు సోషల్ మీడియాలో వచ్చాయి. సుహానా బ్లాక్ డెనిమ్‌లో కనిపిస్తుంది. ఒక చిత్రాన్ని చూస్తే, ఆమె డ్రైవర్‌ను కార్ తొందరగా తీయమని చెబుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫోటోలు చూసిన వెంటనే అభిమానులు ఈ మిస్టరీ బాయ్ ఎవరు అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
Recommended Video


'ది ఆర్చీస్' పుస్తకంపై
సుహానా స్నేహితుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అయితే సుహానా అభిమానులు మాత్రం అతను ఎవరనేది తెలుసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు. ఇక సుహానా ఖాన్, ఖుషీ కపూర్ ఒకే సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. దానికి ఊతం ఇచ్చే విధంగానే సుహానా కూడా జోయా అక్తర్ కార్యాలయంలో చాలాసార్లు కనిపించింది. జోయా అక్తర్ 'ది ఆర్చీస్' పుస్తకంపై ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారని, దాని ద్వారానే ఈ స్టార్‌కిడ్స్‌ను లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా కనిపించనున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











