Sai Pallavi లేడి పవన్ కల్యాణ్.. సమంత గ్యాంగ్ లీడర్.. డైరెక్టర్ సుకుమార్ క్రేజీ కామెంట్
యువ హీరో, హీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన్న నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం మార్చి 4వ తేదీన రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, టాప్ హీరోయిన్లు సాయి పల్లవి, కీర్తీ సురేష్ వచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి గురించి సుకుమార్ మాట్లాడుతుండగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్దగా కేరింతలు పెడుతూ ఆమెపై అభిమానం కురిపించారు. ఆ వివరాల్లోకి వెళితే..\

సమంత గ్యాంగ్ లీడర్
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. సమంత, సాయిపల్లవి, కీర్తి సురేష్ ఓ గ్యాంగ్. వీరికి సమంత గ్యాంగ్ లీడర్. ఈ ముగ్గురు కూడా గొప్ప హీరోయిన్లు, వారి అద్భుతమైన టాలెంట్ కలిగిన వాళ్లు అని అన్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి గురించి చెప్పబోతుండగా అభిమానులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

సుకుమార్ చెవిలో సాయిపల్లవి
సాయిపల్లవి అని సుకుమార్ చెప్పగానే.. హాల్‌లోని ప్రేక్షకులందరూ పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు. దాంతో కొద్ది నిమిషాలు ఆగాల్సి వచ్చింది. అయితే ఆ హోరులో సుకుమార్ మాట్లాడలేకపోయడంతో సాయిపల్లవి ఆయన వద్దకు వచ్చి చెవిలో ఏదో చెప్పారు. సాయిపల్లవి చెవిలో చెప్పిన విషయాన్ని బయటకు చెబుతూ.. ఏదైనా నా గురించి చెప్పాలనుకొంటే నా చెవిలో చెప్పండి అని అన్నారు. అయితే తన గురించి చెప్పడానికి సమయం దక్కలేదు. ఆమె మంచి నటియే కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తి అని సుకుమార్ ప్రశంసలు గుప్పించారు.

యాడ్ ఫిలిం నిరాకరించడంపై
ఒక యాడ్ ఫిలింలో నటించమని సాయిపల్లవిని కోరాను. కానీ కొన్ని విలువలకు విరుద్దంగా ఉండటంతో ఆమె అందులో నటించడానికి నిరాకరించారు. యాడ్‌ను రిజెక్ట్ చేసినందుకు నా సలాం. యాడ్‌ను చేయకపోవడం గొప్ప విషయం. ఇండస్ట్రీలో అలా ఉండటం ఎవరికీ సాధ్యపడదు. ఈ విషయంలో మీరు అందరికి ఇన్సిపిరేషన్. మీరు అలానే ఉండాలి అని సుకుమార్ అన్నారు.

నన్ను ఏడిపించకండి అంటూ..
ఇక ఈ వేదికపై సాయిపల్లవి మాట్లాడానికి సిద్దం కాగానే.. అభిమానుల నుంచి మళ్లీ అదే హోరు కనిపించింది. ఆమె మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకుండా అభిమానులు కేరింతలు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకొన్నారు. అయితే ఒక్క నిమిషం సమయం ఇస్తే నేను మాట్లాడుతాను అంటే.. కొద్ది నిమిషాల అనంతరం అభిమానులు శాంతించారు. ఆ తర్వాత ఆమె ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. ఈ స్టేజ్ మీద మళ్లీ ఏడిపించకండి.. నేను ఈ వేదికపై ఏడవను అని అన్నారు.

ఫ్యామిలీ ఫంక్షన్‌కు వచ్చాం
సాయిపల్లవి మాట్లాడుతూ.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫంక్షన్‌కు నేను గెస్టుగా రాలేదు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వచ్చానని అనిపిస్తున్నది. నేను పడిపడి లేచే మనసు సినిమా చేసినప్పటి నుంచి సుధాకర్, శ్రీకాంత్ నా ఫ్యామిలీ అయ్యారు. అందుకే నేను వారి కోసం వచ్చాను. ఈ సినిమా వారికి మంచి సక్సెస్, హ్యాపీ తీసుకురావాలి. ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











