శ్రియలో ఈ యాంగిల్ కూడా ఉందట... అంధాధున్ లో ఆ పాత్ర ఈమెదేనట
హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరని ఫిగర్ తో ఆకట్టుకోవడం కేవలం శ్రియకు మాత్రమే చెల్లింది. అందుకే అమ్మడు ఇప్పటికీ లీడ్ హీరోయిన్ గానే కొనసాగుతోందని చెప్పాలి. గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత ఓ చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ సొగసరి ఇప్పుడు మళ్లీ అందాలతో విజృంభించేందుకు సిద్ధమవుతోంది.
ఈ మధ్యే RRRలో అమ్మడు కీలక పాత్రకు ఎంపికైందన్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రౌజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రియ అజయ్ దేవగణ్ కు జోడీగా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక రాజమౌళి చేయి తగలడం ఆలస్యం అమ్మడి వద్దకు ఆఫర్లు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి.
తాజాగా శ్రియ అంధాధున్ తెలుగు రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాయి. ఇక హిందీలో టబు నటంచిన పాత్రలో శ్రయ కనిపించబోతోందట. అంటే అమ్మడి కెరీర్ లో తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించబోతోందన్నమాట.

తొలుత తెలుగులోనూ టబునే విలన్ గా కొనసాగించాలని అనుకున్నారు. కానీ, అది వర్కౌట్ అవ్వకపోవడంతో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారు. ఈ పాత్రకోసం అమ్మడు అక్షరాలా 9కోట్లు డిమాండ్ చేయడంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగివచ్చిన టీమ్, చివరకు శ్రియను ఓకే చేసుకున్నారు. మరి కెరీర్ లోనే విభిన్నమైన పాత్ర పోషించబోతున్న శ్రియ టబు ఏమేరకు మరిపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











