'ఆయన నిద్రపోయాక అలాంటి పని చేయడం అలవాటు'
కన్నడ చిత్ర సీమలోని దిగ్గజ నటుల్లో అంబరీష్ కూడా ఒకరు. దశాబ్ధాల పాటు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన రాజకీయవేత్తగానూ ప్రజలకు సేవ చేశారు. తన సహ నటి సుమలతతో ప్రేమలో పడ్డ ఆయన పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లాడారు. అయితే కొన్నేళ్ల క్రితం అంబరీష్ హఠాన్మరణంతో సుమలత కృంగిపోయారు. అన్ని ప్రేమ కథల మాదిరిగానే వీరి ప్రేమను కూడా కొందరు తప్పుబట్టారు. వీరిలో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సుమలత వెల్లడించారు. ఈ వివరాల్లోకి వెళితే..
గుంటూరులో పుట్టి పెరిగిన సుమలత
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన సుమలత చిన్న వయసులోనే హీరోయిన్‌గా అడుగుపెట్టారు. ఓ కార్యక్రమంలో సుమలతను చూసిన దిగ్గజ నిర్మాత డాక్టర్ డీ.రామానాయుడు ఆమెను సినిమాల్లోకి రావాల్సిందిగా కోరారు. 1978లో కరుణామయుడు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సుమలత.. ఆ తర్వాత ఓ దశాబ్ధం పాటు తన హవా చూపించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. అందం, అభినయం, చిరునవ్వుతో ఆ రోజుల్లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు సుమలత.

మొదట్లో అంబరీష్‌కు దూరంగా సుమలత
ఇక ఆమె జీవితంలో అంబరీష్ ఎంట్రీ ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు 39 ఏళ్ల వయసు వరకు బ్యాచిలర్‌గానే ఉన్న అంబరీష్.. సుమలతతో ప్రేమలో పడిపోయారు. 1984లో ఆయన నటించిన ఆహుతి సినిమాలో సుమలతే హీరోయిన్. ఆయన దూకుడు మనస్తత్వం గురించి పరిశ్రమలో రకరకాల ప్రచారాలు ఉండటంతో అంబరీష్‌తో నటించడానికి సైతం ఒక దశలో సుమలత వెనుకాడారట. కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంబరీష్‌తో అంటిముట్టనట్లుగానే ఉండేవారట. అయితే 1987 నాటికి వీరిద్ధరి మధ్య స్నేహం పీక్స్‌కి చేరింది. మిగిలిన తారలతో పోలిస్తే సుమలత నేచర్ డిఫరెంట్‌గా ఉండటంతో ఆమెపై అంబరీష్‌కు ఇష్టం ఏర్పడింది.
రెబల్ ఇన్ ట్రబుల్
1989లో రెబల్ ఇన్ ట్రబుల్ అంటూ ఓ లెటర్ ద్వారా ప్రపోజ్ చేశారట సుమలత. ఆయనలోని నిజాయితీ, మంచితనం గుర్తించిన ఆమె.. వెంటనే అంబరీష్‌కు ఓకే చెప్పడడంతో 1991లో పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. సైలెంట్‌గా, అందరికీ దూరంగా తన పని తాను చేసుకునే టైప్ సుమలత. డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీతో పాటు తను ఎక్కడుంటే అక్కడ జోష్ తెచ్చే వ్యక్తి అంబరీష్. అలాంటిది వీరిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. అంబరీష్‌తో సుమలత ఎక్కువ రోజులు కాపురం చేయలేదని.. ఖచ్చితంగా రెండేళ్లకే వీరు విడిపోతారని అవహేళనగా మాట్లాడరట. సుమలత బెస్ట్ ఫ్రెండ్ , సినీనటి సుహాసినీ కూడా మొదట్లో అంబరీష్‌తో పెళ్లి వద్దని వారించారట.
అంబరీష్ మనసు గెలిచిన సుమలత
ఈ పరిస్ధితులను ఛాలెంజ్‌గా తీసుకున్న సుమలత.. భర్త మన్ననలు పొందారు. ఆయన ఎంత కోపంతో ఊగిపోయినా సుమలత సహనంగా ఉండటంతో ఇద్దరి మధ్యా బాండింగ్ బాగా కుదిరిందట. సుమలతకు సాఫ్ట్ మ్యూజిక్, మెలోడీలు, డిమ్ లైటింగ్ అంటే ఇష్టం కాగా.. అంబరీష్‌కు మాత్రం చెవులు చిల్లులు పడే సంగీతంతో ఇల్లు పీకి పందరి వేసేవారట. ఆయన ఎక్కడున్నా ఖచ్చితంగా పదిమంది ఉండాల్సిందేనట.
అంబరీష్ అలవాటుతో సుమలతకు కష్టాలు
అలాగే అంబరీష్‌కు డిసెంబర్ నెలలో, అందులోనూ బెంగళూరులో రెండు ఏసీలతో మైనస్ 16 డిగ్రీల వద్ద ఉంటే కానీ నిద్రపట్టేది కాదట. కానీ సుమలతకు ఏసీ ఉన్నా లేకున్నా నిద్రపోయేవారట. అయితే అంబరీష్ క్షణాల్లో నిద్రపోయే అలవాటు ఉండటంతో ఆయన నిద్రపోగానే ఏసీలు ఆఫ్ చేసి పడుకునే దాన్నని సుమలత ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. అలా కన్నడ చిత్ర సీమలో బెస్ట్ కపుల్స్‌లో ఒకరిగా నిలిచిపోయారు అంబరీష్- సుమలత. ఈ దంపతులకు కుమారుడు అభిషేక్ సంతానం. అయితే అనారోగ్యంతో 2018లో అంబరీష్ హఠాన్మరణం చెందడంతో సుమలత బాగా కృంగిపోయారు.


Click it and Unblock the Notifications











