రెజీనాతో సందీప్ కిషన్ రిలేషన్.. బెస్ట్ మూమెంట్స్ తో క్లారిటీ ఇచ్చిన యంగ్ స్టార్
టాలీవుడ్ యంగ్ స్టార్ సందీప్ కిషన్ కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. తను తోటీ నటీనటులతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. అయితే సందీప్ కిషన్ హీరోయిన్లను ఎంతో గౌరవిస్తారు. తనతో కలిసి పని చేసిన నటీమణులకు మంచి రెస్పెక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో తన కెరీయర్ లో రెజీనా కస్సాండ్రా పాత్ర గురించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
సందీప్ కిషన్ సినిమాల వివరాలు..
సందీప్ కిషన్ తొలిచిత్రం ప్రస్థానం. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెంటనే స్నేహా హిందీలోనూ ఓ సినిమా చేశారు. గుండెల్లో గోదారి చిత్రంతో సపోర్టింగ్ రోల్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, డీ ఫర్ దోపిడీ, రారా క్రిష్ణయ్య, జోరు, బీరువా, టైగర్, రన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ వెండితెరపై అలరించారు. ఇలా 15 ఏళ్లుగా హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. చివరిగా ఊరు పేరు బైరవకోన, రాయన్, మజాకా వంటి చిత్రాలతో అలరించాడు.

రెజీనాతో సందీప్ కిషన్ రిలేషన్ షిప్..
రెజీనా కస్సాండ్రాతో కలిసి సందీప్ కిషన్ పలు చిత్రాల్లో మెరిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, మానగరం వంటి చిత్రాల్లో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కాగా తాజాగా సందీప్ కిషన్ రెజీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పుకొచ్చారు. రెజీనా తనకు ఫ్యామిలీ మెంబర్ లాంటిదని చెప్పుకొచ్చారు.
అడగకుండానే 5 లక్షలు..
ఇక రెజీనా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. తను ఇల్లు కొన్నప్పుడు కొంత అమౌంట్ తగ్గడంలో రెజీనా హెల్ప్ చెసిందన్నారు. విషయం తెలిసిన వెంటనే రెజీనా అడక్కుండానే రూ.5 లక్షలు పంపించిందని చెప్పారు. తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, మేము ఎంతలా పొట్లాడుకుంటామో అంతలా గౌరవించుకుంటామని, మాలా ఫైట్ చేసుకునే వారుండని చెప్పుకొచ్చారు. రెజీనా గురించి సందీప్ కిషన్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిద్దరి మధ్య ఉన్న స్నేహా బంధానికి అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
నెక్ట్స్ రాబోయే చిత్రాలివే..
సందీప్ కిషన్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రం వైబ్. ఈ చిత్రం ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది. ప్రస్తుతం సందీప్ కు సంబంధించిన మజాకా చిత్రం మాత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతోంది. మరోవైపు కస్సాండ్రా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. విడాముయార్చి, జాట్, కేసరి ఛాప్టర్ 2 వంటి చిత్రాలతో దుమ్ములేపింది. నెక్ట్స్ తమిళంలో మూకుతి అమ్మన్ 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే ఫ్లాష్ బ్యాక్, సెక్షన్ 108 చిత్రాల్లో నటిస్తూ కూడా బిజీ అయ్యిపోయింది. మున్ముందు తన చిత్రాల గురించి మరిన్ని అప్డేట్స్ ను అందించనుంది. ఇదిలా ఉంటే.. మళ్లీ సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











