అతడిని బతికించుకోలేక పోయా... దారుణంగా విఫలం.. నా గుండె పగిలేంత బాధ.. సన్నీలియోన్ కంటతడి
Recommended Video
శృంగార తార సన్నీలియోన్ మనసు ఎంత గొప్పదో చెప్పే సంఘటన ఇటీవల జరిగింది. తాను పాల్గొనే షూటింగ్‌లో ఓ సిబ్బంది జీవన్మరణ సమస్యతో స్పందించడాన్ని తట్టుకోలేకపోయింది. ప్రభాకర్ అనే యూనిట్ సభ్యుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉండటాని చూసి ఊరుకోలేకపోయింది. తాను వ్యక్తిగతంగా సహాయపడుతూనే అతడికి ఆర్థిక సహాయాన్ని అందించాలని తన ఇన్స్‌టాగ్రామ్‌లో కోరింది. ఈ విషయాన్ని తాజాగా అర్బాజ్ ఖాన్ ఛాట్ షోలో వెల్లడిస్తూ కంటతడి పెట్టుకొన్నది. వివరాల్లోకి వెళితే

యూనిట్ సభ్యుడు ప్రభాకర్ చికిత్స కోసం
మా యూనిట్‌లో పనిచేసే ప్రభాకర్ నాకు మిత్రుడి కంటే ఎక్కువ. నా పిల్లల సంరక్షణ చూసే వాడు. అతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. ప్రస్తుతం హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు. డబ్బులు చెల్లించకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యం పట్టించుకోలేదు. అతడి బిల్లులు అన్నీ చెల్లించాం. అతడిని నేను, నా భర్త డేనియల్ వేరే హాస్పిటల్‌కు షిప్ట్ చేశాం అని తెలిపింది.

ప్రభాకర్‌ను బతికించుకొనేందుకు ప్రయత్నం
ప్రభాకర్‌ను ఓ మంచి హాస్పిటల్‌కు తరలించడంతో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 20 శాతం మేరనే కిడ్నీలు పనిచేస్తున్నాయని చెప్పారు. తన కుటుంబానికి అతనే అండ కావడంతో ప్రభాకర్‌ను బతికించేందుకు నానా రకాలు కష్టపడ్డాం. ఓ కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో చికిత్స పొందుతూ మరణించారు అని చెబుతూ సన్నీలియోన్ కన్నీరు మున్నీరైంది.

ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి
అర్బాజ్ ఖాన్ షోలో సన్నీడియోల్ మాట్లాడుతూ.. నేను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టకముందు చాలా రోజుల నుంచే అతడు తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. మెడికల్ బిల్లులు చెల్లించడం సమస్య కాదు. ప్రభాకర్ లేకుంటే అతడి కుటుంబం పరిస్థితి ఏమిటనేది చాలా దారుణంగా అనిపించింది. ఆయనను బతికించుకోవడానికి చాలా ప్రయత్నించాం అని సన్నీ ఆవేదన వ్యక్తం చేసింది.

దారుణంగా విఫలం.. ఆ భాద నన్ను
తాను దారుణమైన సమస్యతో బాధపుడుతున్నప్పటికీ ప్రభాకర్ ఏనాడు ఒకరిని సహాయం కోసం చేయి చాపలేదు. తన బాధను తానే భరిస్తూ తన కుటుంబం కోసం కష్టపడ్డారు. అలాంటి వ్యక్తిని బతికించుకొనేందుకు చాలా ప్రయత్నించాం. అతడిని బతికించుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాం. ఆ బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నది అని సన్నీలియోన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











