హారర్ కామెడీ మూవీలో సన్నీలియోన్.. శృంగార తార పక్కన హీరో ఎవరంటే..
తమిళ చిత్ర సినీ పరిశ్రమలోకి మరోసారి శృంగార తార సన్నిలియోన్ అడుగుపెట్టింది. హారర్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సింధానై సీ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్ యువన్ ఈ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. సన్నీలియోన్ సరసన యాక్టర్ సతీష్ హీరోగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మొట్టాయి రాజేంద్రన్, రమేశ్ తిలక్ తదితరులు నటిస్తున్నారు.
సన్నీలియోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు చెన్నైలో ఏప్రిల్ 19వ తేదీన చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ప్రారంభమైంది. షూటింగ్ ఆరంభం సందర్భంగా కమెడియన్ వివేక్ మృతికి సంతాపం ప్రకటించి.. ఆయన శ్రద్దాంజలి ఘటించారు.

సన్నీలియోన్ కెరీర్ విషయానికి వస్తే.. వడ కర్రీ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీరమదేవి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కరోనా కారణంగా ఆగిపోయింది. పలు మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.
గత కొద్ది రోజులుగా సన్నీలియోన్ కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా ఆమె స్ల్పిట్ విల్లా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులతోపాటు భారత పర్యటనకు ఆమె రావడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











