Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా లైఫ్ చాలా దారుణం... పలు చీకటి కోణాలు.. మళ్లీ అలాంటి.. భోరుమని ఏడ్చిన సన్నీలియోన్
శృంగార తార సన్నీలియోన్ జీవితం ఆధారంగా కరంజీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ అనే బయోపిక్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కుతున్నది. ఈ వెబ్ సిరీస్ చివరి సీజన్ కోసం సన్నీలియోన్ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో చోటుచేసుకొన్న చేదు అనుభవాలను తలచుకొన్న కన్నీరుమున్నీరయ్యారు. కంటతడి పెట్టుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అసలేం జరిగిందంటే...
తన బయోపిక్ గురించి
తన జీవితంపై వస్తున్న కరంజిత్ కౌర్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా చీకటి కోణాలు. విషాదకర సంఘటనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు కాళరాత్రులగా మిగిలిపోయాయి. ఏక కాలంలో నన్ను కష్టాలు చుట్టుముట్టాయి. వాటిని మళ్లీ తలచుకోవడమంటే, చూడటమంటే నేను తట్టుకోలేను అని సన్నీలియోన్ అన్నారు. సన్నిలియోన్ అసలు పేరు కరంజిత్ కౌర్ అనే విషయం తెలిసిందే.
అనేక విషాదాలతో లైఫ్
నా జీవితంలో ఊహించని విధంగా నా తల్లి అకాల మరణం పొందారు. ఆ వెంటనే నా తండ్రి క్యాన్సర్ వ్యాధికి గురై చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకొంటున్న సమయంలోనే పెళ్లి జరిగింది. భారత్‌లో టెలివిజన్ షో బిగ్‌బాస్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఇలా చాలా వేగంగా నా జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి అని సన్నీలియోన్ తన కష్ట సుఖాలను తెలిపారు.
గుర్తు చేసుకొంటే గుండె పగులుతుంది..
కొన్ని సంఘటనలను గుర్తు చేసుకొంటే గుండె పగిలిపోద్ది. అలాంటి విషయాలను మళ్లీ గుర్తు తెచ్చుకోవడం, వాటిని తెరపైన చూడాల్సి వస్తుందటే కంట్లో నీరు ఉబికి వస్తుంది. గొంతులో నుంచి దుఖం పరుగులు పెడుతుంది. కొన్ని సంఘటనలు నా భర్త చూసి తట్టుకోలేకపోతారు. నా తల్లిదండ్రులను కోల్పోవడం అతిపెద్ద విషాదం అని సన్నీలియోన్ అన్నారు.
బాలీవుడ్ నాకు దారి చూపింది
నేను విషాదంలో కూరుకుపోయినప్పుడు బాలీవుడ్ నాకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. సానుకూలమైన దారిని చూపించింది. తొలి రోజుల్లో ఏదో అనుకొంటే.. మరొకటి జరిగేది. చివరకు నాకు ఇండస్ట్రీ మంచి జీవితాన్ని ప్రసాదించింది అని సన్నీలియోన్ చెప్పింది. కష్ట సమయాల్లో నా భర్త డేనియల్ వెబర్ అండగా నిలిచారు. మనోధైర్యాన్ని ఇచ్చారని ఆమె వెల్లడించింది.