టెంపర్ రీమేక్ కోసం సన్నీలియోన్‌ని దించుతున్నారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం పలు భాషల్లో రీమేక్ అవుతోంది. ఇప్పటికే హిందీలో సింబా పేరుతో రీమేక్ అయింది. రణవీర్ సింగ్ నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ లో విశాల్ చేతిలో బీరు బాటిల్ పట్టుకుని కనిపించాడు. అది కాస్త వివాదంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విశాల్ సరసన శృంగార తార సన్నీలియోన్ చిందేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటెం సాంగ్ కోసం సన్నీలియోన్ ని రంగంలోకి దించుతున్నారు. సన్నీలియోన్ ఉంటె ఆ చిత్ర క్రేజ్ మరింతగా పెరుగుతుంది. తమిళంలో సన్నిలియోన్ ప్రధాన పాత్రలో వీరమహాదేవి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ మోహన్ దర్శత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో విశాల్ కు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది.

తెలుగులో టెంపర్ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి మంచిగా ఎలా మారాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో టెంపర్ చిత్రం రూపొందింది. తమిళంలో కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే ధీమాని చిత్ర యూనిట్ వ్యక్తపరుస్తోంది.


Click it and Unblock the Notifications











