వింత ఆకారంలో సన్నీలియోన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్
సన్నీలియోన్ అంటేనే శృంగార తారగా ప్రపంచమంతా సుపరిచితం. మంచి పాపులారిటీతో సెక్సీ హీరోయిన్‌గా వెండితెరపై కాలుమోపిన ఆమె అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన బెడితే వెండితెరపై సన్నీలియోన్‌ని చూడాలనే ఉద్దేశ్యంతోనే థియేటర్స్‌కి పరుగులు పెడతారు యూత్ ఆడియన్స్. ఆమె క్రేజ్, హాట్‌నెస్ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా సన్నీలియోన్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మరోవైపు ఐటెం సాంగ్స్, ఫోటో షూట్స్ చేస్తూ టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్‌ని మత్తెక్కించడం సన్నీలియోన్ లోని మరో ప్రత్యేకత.
కాగా తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన రెగ్యులర్ స్టైల్‌కి భిన్నంగా ఫోటోలకు ఫోజులిచ్చింది సన్నీ. సాగరకన్య గెటప్ వేసి డిఫెరెంట్ కిక్కించింది. ఈ లుక్‌లో ఎంతో అందంగా, నాజూకుగా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది సన్నీ. ఈ పిక్ పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తూ హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. గతంలో దర్శకేంద్రుడు తెరకెక్కించిన 'సాహసవీరుడు సాగరకన్య' సినిమాలో శిల్పాశెట్టిని సాగరకన్యగా చూశాం.. ఇప్పుడు అదే లుక్ లో సన్నీని చూడటం ఆనందంగా ఉంది, సాగరకన్య గెటప్ అంటే శిలాశెట్టినే అనుకున్నాం.. ఆమె మరిపించావ్‌గా సన్నీ అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సన్నీ సినిమాల విషయానికొస్తే.. పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈమె టాలీవుడ్ తెరపై కూడా స్థానం సంపాదించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో ఐటెం సాంగ్స్ కోసం సన్నీనే బెట్టర్ ఆప్షన్ అని భావిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











