సన్నీలియోన్ బ్రాండ్.. ఆ సత్తా ఆమెకే ఉంది.. ఇక చెడుగుడే!
సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్. ఆమె జీవితంలో ఎన్నో చీకటి కోణాలు. కానీ వాటన్నింటి నుంచీ బయటకు వచ్చి హీరోయిన్‌గా సత్తా చాటుతోంది సన్నీ. పలు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా తాను ప్రత్యేకం అని నిరూపించుకుంటోంది. బాలీవుడ్, టాలీవుడ్ తెరలపై అందాలు ఆరబోస్తూ ఫేమస్ అయిన ఈ అమ్మడికి దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. లక్షల కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈమెను తమ జట్టుకు బ్రాండ్అంబాసిడర్‌గా ఎంచుకుంది టీ10 లీగ్ ఫ్రాంచైజీ ఢిల్లీ బుల్స్ జట్టు.
ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ బుల్స్ తన కొత్త జెర్సీ, కొత్త గీతాన్ని ఆవిష్కరించింది. అదేవిధంగా సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నట్టు జట్టు సహ యజమాని రిజ్వాన్ సాజన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీలియోన్.. సందడి చేస్తూ జట్టు సభ్యులకు స్పెషల్ కిక్ ఇచ్చింది.

ఈ సందర్బంగా మాట్లాడిన ఢిల్లీ బుల్స్.. సహ యజమాని రిజ్వాన్ సాజన్ సన్నీలియోన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. బుల్స్ ప్రచారకర్తగా ధైర్యవంతురాలు, అందాల రాశి సన్నీలియోన్‌ని ఆహ్వానిస్తున్నామని, సన్నీ తమ జట్టుకు అందం అని, ఆమె భారీగా అభిమానులను స్టేడియాలకు తీసుకురాగలదని అన్నాడు. అంటే తమ జట్టు చెడుగుడు ఆడేస్తుందని చెప్పరన్నమాట. బుల్స్‌కు ప్రచారకర్తగా ఎంపికైనందుకు సన్నీ లియోన్ కూడా ఆనందం వ్యక్తం చేసింది.
'మంచి అభిరుచి గల జట్టులో భాగం అయినందుకు సంతోషం. వ్యక్తిగతంగా ఈ జెర్సీ రంగు చాలా ఇష్టం. బుల్స్ జట్టుకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా' అని సన్నీలియోన్ చెప్పింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, చేయబోయే ప్రాజెక్టుల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నానని అంటున్న ఆమె.. నటించడమే తన అల్టిమేట్ గోల్ అని చెబుతోంది.


Click it and Unblock the Notifications











