మంచు విష్ణు సినిమా కోసం మాజీ శృంగార తార షాకింగ్ రెమ్యునరేషన్.. 20 రోజులకు అన్ని కోట్లా?

మాజీ శృంగారతార సన్నీ లియోన్ గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉండడంతో ఎలాంటి సినిమా చేసినా కూడా సోషల్ మీడియాలో అయితే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక సన్నీలియోన్ ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడతారు.

ఇక తెలుగులో చాలా రోజుల తర్వాత సన్నీ లియోన్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తున్న సన్నీ లియోన్ ఎవరూ ఊహించని విధంగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే

ఫ్యామిలీ లైఫ్ లో సన్నీ..

ఫ్యామిలీ లైఫ్ లో సన్నీ..

గ్లామరస్ బ్యూటీ సన్నీలియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి దూరమైన తరువాత ఆమె సరి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ముగ్గురు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత ఆమె మంచి నటిగా గుర్తింపు అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సన్నిలియోన్ ముంబయిలోని ఒక ఒక చిన్నారిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

 పేదలకు సహాయం

పేదలకు సహాయం

సన్నీ లియోన్ కేవలం సినిమాలలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో మాత్రం మంచి మనసున్న మహిళ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. కరోనా కష్టకాలంలో కూడా ఆమె చాలా మంది పేదలకు సహాయం కూడా చేసింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండే సన్నిలియోన్ సోషల్ మీడియాలో కూడా గ్లామరస్ ఫోటోలతో నిత్యం సందడి చేస్తూనే ఉంటుంది.

 40 ఏళ్ళల్లో కూడా..

40 ఏళ్ళల్లో కూడా..

సన్నీలియోన్ వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా మరింత అందంతో ఎంతగానో ఆకట్టుకుంటోంది. 40 ఏళ్ల లోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలోనే దర్శనమిస్తోంది. ఇక సన్నీలియోన్ చాలా కాలం తర్వాత సౌత్ ఇండస్ట్రీలో మరో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. మొదట ఆమె మంచు మనోజ్ కరెంటు తీగ సినిమాలో ఒక స్పెషల్ పాత్రతో అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం తెలిసిందే.

మంచు విష్ణు సినిమాలో..

మంచు విష్ణు సినిమాలో..

ఇక ఆమె చివరగా తెలుగులో రాజశేఖర్ నటించిన గరుడవేగా సినిమాలో ఐటెం సాంగ్ తో ఆకట్టుకుంది. ఇక ఆ పాట అనంతరం ఎంతగానో క్రేజ్ అందుకున్నప్పటికీ మళ్లీ ఆమె తెలుగు సినిమాల్లో అయితే కనిపించలేదు. ఇక ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న గాలి నాగేశ్వరరావు అనే సినిమాలో సన్నీ లియోన్ ఒక ఎన్నారై పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

అయితే గాలి నాగేశ్వరరావు సినిమా కోసం దాదాపు 20 రోజులపాటు డేట్స్ ఇచ్చిన సన్నీ లియోన్ ఈ సినిమా కోసం గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మంచు విష్ణు సొంత బ్యానర్ లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం సన్నీ దాదాపు రెండు కోట్ల రూపాయల పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి సన్నీ లియోన్ క్రేజ్ తో ఈ సినిమాకు ఎంతవరకు లాభం చేకూరుతుంది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X