Sunny Leone 80వ దశకం హీరోతో శృంగార తార.. 28 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ ఎంట్రీ
దక్షిణాదిలో పాగా వేసేందుకు బాలీవుడ్ శృంగార తార సన్నిలియోన్ ప్రణాళికను సిద్దం చేసుకొంటున్నది. ఇప్పటికే మలయాళ భాషలో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్న ఈ అందాల భామ ప్రస్తుతం తెలుగు, తమిళ రంగాల్లో తన సత్తాను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. తెలుగులో విష్ణు మంచు నటించిన జిన్నా సినిమాలో కీలక పాత్రను పోషించింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే సన్నిలియోన్‌పై భారీ క్రేజ్ నెలకొన్నది. ఇక జిన్నా తర్వాత తమిళంలో సీనియర్ హీరో, హీరోయిన్లతో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ మూవీ వివరాల్లోకి వెళితే..
80వ దశకంలో ప్రేమ కథా చిత్రాలతో, యాక్షన్ సినిమాలతో యువతను ఆకట్టుకొన్న నవరస నాయకన్ కార్తీక్ త్వరలోనే ఓ ఫీల్ గుడ్ చిత్రంలో నటించనున్నారు. థీ ఇవాన్ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి టీజే జయమురుగన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రాధారవి, సుమన్, జే శ్రీధర్ తదితరులు నటిస్తున్నారు. మనిథాన్ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందే ఈ చిత్రంలో సన్నీలియోన్ కీలక పాత్రను పోషించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రాన్ని 2023లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

అయితే థి ఇవాన్ చిత్రంలో 28 ఏళ్ల తర్వాత హీరోయిన్ సుకన్యతో కార్తీక్ జతకట్టనున్నారు. గతంలో అంటే.. 1996లో సీమాన్ అనే చిత్రంలో ఈ జంట ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది.


Click it and Unblock the Notifications











