సన్నిలియోన్‌కు చేదు అనుభవం.. చీటింగ్ కేసుతో షాక్.. ప్రశ్నించిన కేరళ క్రైమ్ బ్రాంచ్

కేరళలో పర్యటిస్తున్న శృంగార తార సన్నీలియోన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కంపెనీకి చెందిన నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో సన్నిలియోన్‌ను కేరళ పోలీసులు ప్రశ్నించారు. గత కొద్ది వారాలుగా ఓ ప్రైవేట్ షో షూటింగ్ కోసం వచ్చిన ఆమె ప్రైవేట్ రిసార్టులో విడిది చేశారు. తిరువనంతపురంలోని రిసార్టులోనే పోలీసులు ఆమెను ప్రశ్నించడం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

29 లక్షలు తీసుకొని.. ముఖం చాటేశారంటూ

29 లక్షలు తీసుకొని.. ముఖం చాటేశారంటూ

కేరళ డీజీపీకి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజర్ ఫిర్యాదు ప్రకారం.. కొన్ని వ్యాపార సంస్థలకు చెందిన షాపులను, ఇతర సంస్థల ప్రారంభోత్సవానికి హాజరు అవుతానని మాతో ఒప్పందం చేసుకొన్నారు. ఆ మేరకు రూ.29 లక్షలు అడ్వాన్సుగా తీసుకొన్నారు. అయితే తాము ఆహ్వానం పంపినప్పటికి సన్నిలియోన్ ప్రారంభోత్సవాలకు హాజరు కాలేదు. కాబట్టి చట్ట రీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రారంభోత్సవాలకు రావాలని కోరినా గానీ

ప్రారంభోత్సవాలకు రావాలని కోరినా గానీ

మా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం జరిగిన తర్వాత దశల వారీగా మా నుంచి డబ్బు తీసుకొన్నారు. 2016 నుంచి మేము సన్నిలియోన్‌కు డబ్బు చెల్లించాం. పలుమార్లు మేము రిక్వెస్ట్ చేసినా గానీ ఆమె స్పందించలేదు. మా ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించారు. అందుకే ఆమెపై డీజీపీకి ఫిర్యాదు చేశాం అని మీడియాకు ఈవెంట్ మేనేజర్ తెలిపారు.

 ఈవెంట్ మేనేజర్ చీట్ చేశాడు..

ఈవెంట్ మేనేజర్ చీట్ చేశాడు..

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఫిర్యాదు మేరకు సన్నిలియోన్‌ను గురువారం కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నుంచి డబ్బు తీసుకొన్న విషయం నిజమే. కానీ ఆ సంస్థ తనను చీట్ చేసింది. అందుకే ఆ రిక్వెస్ట్‌కు స్పందించలేదని సన్నిలియోన్ కేరళ పోలీసులకు చెప్పినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

 సన్నిలియోన్ ప్రత్యారోపణలతో కేసులో ట్విస్టు

సన్నిలియోన్ ప్రత్యారోపణలతో కేసులో ట్విస్టు

సన్నిలియోన్ ప్రత్యారోపణలు చేయడంతో ఈ కేసు ట్విస్టుగా మారింది. విచారణ సందర్భంగా కేరళ పోలీసులు ప్రశ్నించగా సన్నిలియోన్‌ను చెప్పిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడిని కూడా విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇరు పార్టీలను ప్రశ్నించి సమాచారం సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కేరళ పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

 సన్నిలియోన్ కెరీర్ ఇలా

సన్నిలియోన్ కెరీర్ ఇలా

స్ల్పిట్ విల్లా అనే టీవీ షో షూటింగ్‌ కోసం వచ్చిన సన్నిలియోన్ తన కుటుంబ సభ్యులతో కేరళలో నెలరోజుల పాటు విడిది చేయనున్నారు. ఇందుకోసం ఓ ప్రైవేట్ రిసార్టును ఆమె బుక్ చేసుకొన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. హిందీ, తెలుగు భాషల్లో రూపొందే కోకా కోలా, హెలెన్ చిత్రాల్లో.. అలాగే కోటిగుబ్బా 3 కన్నడ చిత్రంలో, మరో హిందీ చిత్రంలో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X