46 ఏళ్ల వయసులో ఆ పని మొదలెట్టిన మహేష్ బాబు బ్యూటీ... ఇంతకీ ఏంటంటే?

సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ సుమంత్ సినిమా యువకుడుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భామ గోవాలో ఈ వయసులో ఓ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆ బిజినెస్ ఏంటి.. ఎందుకు గోవాలో స్టార్ట్ చేసిందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సీనియర్ యాక్టర్ భూమిక చావ్లా తన సినిమాలతో ఎంతగానో అలరించింది. ఢిల్లీలో జ‌న్మించిన భూమిక‌.. సినిమాలపై ఆసక్తితోనే మొద‌ట మోడ‌లింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత యాడ్స్ లో న‌టిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన తేరే నామ్ మూవీకి భూమిక ఫ‌స్ట్ సైన్ చేసినప్పటికీ... టాలీవుడ్ లో యువ‌కుడు ముందుగా రిలీజ్ అయింది. సుమంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్ గా నటించింది.

Super Srar Mahesh Babu Heroine Bhumika Chawla Started New Hotel Bussiness in Goa News Goes Viral

యువకుడు చిత్రం భూమికకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమాతో ఆమె అందరి చూపును ఆకట్టుకుంది. ఆ తర్వాత ఖుషి మూవీ, ఒక్కడు మహేశ్ బాబు సినిమల్లో నటించిన భూమికకు టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. స్టార్ హీరోలు మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారితో నటించిన భూమిక.. అందరి ఫేవరెట్ భామగా మారిపోయింది. ఇక చిరంజీవి సినిమాలో కూడా నటించి మెప్పించింది.

కెరియర్ పీక్ స్టేజ్ లో ఉందనగా... పెళ్లి పెట‌లెక్కింది. యోగా నిపుణులు భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకుని.. పెళ్లి జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఈ దంప‌తుల‌కు ఒక బాబు కూడా పుట్టాడు. అయితే వివాహం అనంత‌రం హీరోయిన్ గా భూమిక గ్రాఫ్ డౌన్ అవుతూ వ‌చ్చిందనే చెప్పాలి. దాంతో ఆమె కొంత గ్యాప్ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుంది. 2016లో ఎమ్. ఎస్. ధోని చిత్రంతో భూమిక త‌న సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల్లో బ‌ల‌మైన స‌పోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ... ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. భూమిక తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. గోవాలో ఆమె కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా భూమిక వెల్లడించింది. అయితే భూమిక ప్రారంభించిన వ్యాపారం హోటల్ బిజినెస్. దానికి సంబంఛిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది ఈ భామ.

గోవాలోని మోర్జిమ్ లో సమర వెల్నెస్ హోటల్ పేరుతో భూమిక న్యూ వెంచ‌ర్ ను ప్రారంభించింది. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి భూమిక త‌న‌ హోట‌ల్ కు రిబ్బ‌న్ క‌ట్ చేసింది కూడా. బీచ్ ప‌క్క‌న ఈ హోట‌ల్ ఉంటుండగా... గోవాలో హాయిగా రిలాక్స్ అవ్వాల‌నుకునే వారికి ఈ హోట‌ల్ లో స్పాతో స‌హా అన్ని సౌక‌ర్యాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఎంట‌ర్టైన్మెంట్ కోసం మ్యూజిక్‌, డ్యాన్స్ కార్య‌క్ర‌మాలు కూడా ఉంటాయని తన ఇన్ స్టాగ్రామ్లో తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X