Mahesh Babu దిమ్మదిరిగేపోయే న్యూ లుక్.. 47లో అందమేంటి బాబు.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాయి అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ స్టార్ హీరో సినిమాల్లో ఎలా ఉంటాడో రియల్ లైఫ్ లో కూడా అదే తరహా గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక మహేష్ బాబు ఒక ఫోటో షూట్ చేశాడు అంటే సోషల్ మీడియాలో ఆ హడావిడి కొన్ని నెలల వరకు కొనసాగుతుంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు స్పెషల్ బ్రాండ్ ఫోటోషూట్ లో కూడా దిమ్మతిరిగేలా చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
SSMB 28 తో బిజీగా..: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ 28వ ప్రాజెక్ట్ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమా సంబంధించిన టైటిల్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం కొన్ని టైటిల్స్ అయితే చర్చల దశలో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ అయితే సగం వరకు ఫినిష్ అయినట్లు టాక్. ఇక ఫైనల్ గా రానున్న రోజుల్లో టైటిల్ అనౌన్స్మెంట్ ఉండబోతోంది.

అంతకుమించి అనేలా..: త్రివిక్రమ్ అయితే మహేష్ బాబును నెవర్ బిఫోర్ అనేలా సరికొత్తగా చూపించబోతున్నట్లు ఇదివరకే ఫస్ట్ లుక్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంతకు ముందు మహేష్ బాబు ప్రతి సినిమాలో కూడా హ్యాండ్సమ్ లుక్స్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈసారి కూడా త్రివిక్రమ్ సినిమాలో అయితే అంతకుమించి అనే అందంతో మహేష్ కనిపించబోతున్నట్లుగా ఆ ఫస్ట్ లుక్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.
ఈ వయసులో కూడా.. : మహేష్ బాబు వయసు 47 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా మహేష్ ఇంకా పాతికేళ్ల కుర్రాడి తరహా లోనే దర్శనమిస్తూ ఉండడం విశేషం. మహేష్ బాబు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతోనే కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే పాజిటివ్ గా ఆలోచిస్తానని అంటుంటాడు. ఒక విధంగా తన ఆరోగ్యానికి అది కూడా ముఖ్య సూత్రం అని చెబుతూ ఉంటాడు.

నెవ్వర్ బిఫోర్ లుక్స్ :
ఇక మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని స్పెషల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మహేష్ బాబు కొన్ని డిఫరెంట్ షర్ట్స్ లలో కనిపించిన విధానం ఎంతగానో కట్టుకుంటుంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ అయితే నెవర్ బిఫోర్ అనేలా కనిపిస్తోంది. మహేష్ బాబు రోజురోజుకు మరింత అందంగా మారిపోతున్నాడు అంటూ నెటిజన్లు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఈ ఫొటోషూట్ ఎందుకంటే.. : ఇక ఇంత హఠాత్తుగా మహేష్ బాబు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే ఒక ప్రముఖ క్లాత్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా మహేష్ ఈ విధంగా ఫోటోలకు స్టిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఇప్పటికే నేషనల్ వైడ్ గా కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ తో కొనసాగుతున్నాడు ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ లో కూడా మహేష్ ప్రమోషన్స్ తో బిజీ అవుతూ ఉండడం విశేషం.

రాజమౌళి సినిమా : ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ అయితే శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా వీలైనంత త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ బాబు సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











