Namrata Shirodkar: కోటేసి మరీ కొత్తందాలు చూపించిన నమ్రత.. 51 ఏళ్ల వయసులోనూ యమా క్రేజీగా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా కోటేసి మరీ కొత్తందాలు చూపించింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈమె.. 51 ఏళ్ల వయసులోనూ యమా క్రేజీగా ముస్తాబై వయ్యారాలు ఒలకబోసింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నమ్రత శిరోద్కర్ ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా.. తన భర్త మహేష్ బాబులాగే స్పెషల్ డైట్ ను ఫాలో అవుతుంది. గతంలో లాగే తన అందం, ఫిగర్ ను కాపాడుకుంటూ వస్తోంది. పిల్లలు, భర్త, ఫ్యామిలీ బాధ్యతలతో పాటు బిజినెస్ పనులు కూడా చూసుకునే ఈమె తనకు కూడా కాస్త టైమ్ కేటాయించుకుంటుంది. అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా వివరిస్తుంటుంది.

అలాగే అప్పుడప్పుడూ ట్రైండీ ఔట్ ఫిట్లలో దర్శనం ఇస్తూ కుర్రకారను ఆగం చేస్తుంటుంది. అలాగే తన భర్త, పిల్లల ఫొటోలను కూడా పెడుతూ... తన సంతోషాన్ని అందరితో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో యాష్ కలర్ ఫార్మల్ షర్ట్, ప్యాంట్ వేసుకుని పైన కోట్ వేసుకుంది. అలాగే వైట్ కలర్ షూ స్టైల్ చేసి.. కూలింగ్ గ్లాసెస్ పెట్టి మరీ కూల్ గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
ప్రస్తుతం నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మహేష్ బాబు తో పాటు నమ్రత ఫ్యాన్స్ అందరూ ఈ ఫొటోలకు పెద్ద ఎత్తున, లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. 51 ఏళ్ల వయసులోనూ ఇంతందంగా ఉన్నారేంటంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. రోజురోజుకూ అందాలు తగ్గి వయసు పెరగాల్సింది పోయి.. వయసు తగ్గుతూ అందాలు పెరుగుతున్నాయని అంటున్నారు.

మరికొందరు అయితే మా సూపర్ స్టార్ భార్యగా, ఆయనకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు మరింత అందంగా, స్టైలిష్ గా తయారు అవుతూ చక్కగా కనిపిస్తున్నారని అంటున్నారు. మీరెప్పుడూ ఇలాగే ఆయనకు తగ్గట్లుగా కనిపిస్తుండాలని కోరుకుంటున్నమంటూ కామెంట్లు చేశారు. మీరు కూడా ఓసారి నమ్రత శిరోద్కర్ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











