Namrata Shirodkar: మహేశ్‌ హీరోయిన్‌ షాకిచ్చిన నమ్రత.. అలా ట్రీట్ చేసిందా?

తండ్రి కృష్ణ అడుగుజాడల్లో సినీరంగ ప్రవేశం చేసి సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్ బాబు. భారతదేశంలో హయ్యెస్ట్ పెయిడ్ నటుల్లో ఆయన ఒకరు. సినిమాలే కాదు సంపాదించిన డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టి బిజినెస్‌మెన్‌గానూ సక్సెస్ అయ్యారు ప్రిన్స్. ఇక దేశంలోని ఎన్నో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే లక్ష్యంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మహేశ్ బాబు. ఆయన వెనుక భార్య నమ్రత శిరోద్కర్ కూడా నడుస్తున్నారు. తాజాగా ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు . ఈ వివరాల్లోకి వెళితే..

గతంతో పోలిస్తే వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. మొండి వ్యాధులకు చికిత్సను, మందులను కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే కొన్ని రకాల మహమ్మారులు మాత్రం మానవాళికి లొంగడం లేదు. వీటిలో క్యాన్సర్ ఒకటి. సైలెంట్ కిల్లర్‌గా పిలిచే వ్యాధుల్లో క్యాన్సర్ ముఖ్యమైనది. పీకల మీదకు వచ్చే వరకు రోగిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించవు. ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తొలిదశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే దాని నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

super star mahesh babu wife namrata Shirodkar emotional post

క్యాన్సర్‌ను చాలా రకాలుగా వర్గీకరించగా.. చాలా సందర్భాల్లో పరిస్ధితి చేయిదాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం, వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం ఒక్కటే క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా ఆగస్ట్ 1ని క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

అయితే క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించామనగానే సరిపోదు. ఈ వ్యాధికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నది.. ముఖ్యంగా పేదలు, అల్పాదాయ వర్గాలు క్యాన్సర్ చికిత్సను భరించలేరు. మందులు వాడితే బయటపడతామని తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్నో స్వచ్చంద సేవా సంస్థలు, దాతలు, ప్రముఖులు పేద క్యాన్సర్ రోగులకు చేతనైన సాయం చేస్తున్నారు. కానీ ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

సామాన్యులే కాదు.. ఎంతోమంది సినీ ప్రముఖులు క్యాన్సర్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే కొందరు నటీనటులు మాత్రం ఆత్మ విశ్వాసం, గుండె ధైర్యంతో క్యాన్సర్‌ను జయించారు. వేలాది మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తున్నారు మహేశ్ బాబు‌. ఈ క్రమంలో భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నారు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్. జీవీకే హెల్త్ హబ్ ఆధ్వర్యంలో టీ . సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి నిర్వహించిన మేక్ యువర్ పింక్ మార్క్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

https://www.instagram.com/stories/iamsonalibendre/

ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన సినీనటి సోనాలి బింద్రే కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత పంచుకున్నారు. సోనాలిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని.. కానీ నెక్ట్స్ టైమ్ ఆమెను ఇంటికి పిలిచి టీ ఇస్తానని నమ్రత రాసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌ను చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X