రజని సరసన నయనతార.. మురుగదాస్ చిత్రంలో మరో క్రేజీ బ్యూటీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల దూకుడు కొనసాగుతోంది. గత ఏడాది రజిని కాలా, 2.0 చిత్రాలతో సందడి చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించ పేట చిత్రంతో అభిమానులని అలరించారు. ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజనీకాంత్ తో చిత్రానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మురుగదాస్ గత ఏడాది సర్కార్ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఆ చిత్రం వివాదాలతో పాటు, రికార్డులు కూడా క్రియేట్ చేసింది.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సర్కార్ విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరోమారు విజయ్ రాజకీయ నేపథ్యంలో ఉన్న కథనే సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా రజని, మురుగదాస్ చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రజనికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార, కీర్తి సురేష్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

Super star Rajinikanth to romance with Nayanthara and Keerthy Suresh

నయనతారకు రజనితో ఇది హ్యాట్రిక్ మూవీ. ఇది వరకు చంద్రముఖి, కథానాయకుడు చిత్రాల్లో నయన్ రజని సరసన నటించింది. మహానటి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X