మా కన్నీటిని కూడా క్యాష్ చేసుకున్నారు.. యంగ్ హీరోయిన్ ఎమోషనల్..

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి (Surekha Vani)కుమార్తె సుప్రీత (Supritha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా అధికారికంగా ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సుప్రీత... ఫోటోలు, రీల్స్, పర్సనల్ అప్‌డేట్స్‌తో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అదే పాపులారిటీతో ఇప్పుడు వెండితెరపై అడుగుపెట్టిన ఆమె నటించిన తొలి సినిమా అమరావతికి ఆహ్వానం (Amaravathiki Aahvanam) ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, సుప్రీత స్క్రీన్ ప్రెజెన్స్‌పై మాత్రం పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సుప్రీత... తన వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా ట్రోలింగ్, అలాగే నేపోటిజం ఆరోపణలు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదంపై ఓపెన్‌గా మాట్లాడింది.

Supritha Breaks Silence on Trolls Betting Apps Case During Amaravathiki Aahvanam Promotions

తనపై నెగెటివ్ ప్రచారాల గురించి మాట్లాడిన సుప్రీత.. 'మా గురించి తప్పుడు కథనాలు రాసినప్పుడు మేము ఎంతగా బాధపడ్డామో మాకే తెలుసు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరకు కొన్ని కథనాలు ప్రభావం చూపించాయంటే, మీడియా మాటలకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు మమ్మల్ని లోపల నుంచి బలంగా చేశాయి' అని భావోద్వేగంగా చెప్పింది.

ట్రోలర్స్‌కు రియాక్ట్ అవ్వడమే వారికి TRP ఇచ్చినట్టేనని స్పష్టం చేసిన ఆమె.. 'అందుకే మేము ఒకటే ఫిక్స్ అయ్యాం.. స్పందించకపోవడమే మా మెడిసిన్. ఈరోజు మా గురించి ఎంత నెగెటివ్‌గా రాసినా మేము నవ్వుకునే స్టేజ్‌లో ఉన్నాం. మా కన్నీటిని కూడా క్యాష్ చేసుకుంటారంటే అది వాళ్ల ఇష్టం... చివరకు అన్నీ దేవుడే చూస్తాడు'అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై కూడా సుప్రీత ఓపెన్‌గా మాట్లాడింది. 'అది నేను చేసిన తప్పే. ఆ సమయంలో ఇది తప్పు అని చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు. ఇప్పుడు ఏ ప్రమోషన్ అయినా లాయర్ సలహా తీసుకున్న తర్వాతే ఒప్పుకుంటున్నాం. ఇది తెలియక చేసిన పొరపాటు... ఇకపై అలాంటి తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం'అని స్పష్టం చేసింది.

ఇండస్ట్రీలో నేపోటిజం ఉందన్న ఆరోపణలపై స్పందిస్తూ... 'నాకు వచ్చిన అవకాశాలు నా టాలెంట్ వల్లే. నేపోటిజం ఉందని నేను నమ్మను. ఈ ఆలోచన ఇండస్ట్రీకి మంచిది కాదు.అలాగే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదన్నది నిజం. నేను కూడా నా తల్లి ఇన్‌ఫ్లుయెన్స్ వాడుకోకుండా, నా ప్రతిభ ఆధారంగానే సినిమాలు చేయాలనుకుంటున్నాను' అని చెప్పింది.

తన తల్లి రెండో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై కూడా సుప్రీత క్లారిటీ ఇచ్చింది. 'అది నా వ్యక్తిగత కోరిక మాత్రమే. కానీ మా అమ్మకు మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ఆమె లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉండాలనుకుంటోంది. నేను చెప్పిన మాటలను కొందరు నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపై కెరీర్‌లో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తానని స్పష్టం చేస్తూ, నెగెటివిటీని పక్కన పెట్టి పాజిటివ్‌గా ముందుకు వెళ్లాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Read more about: tollywood surekha vani supritha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X