సురేఖ వాణి రెండో పెళ్లిపై కూతురు కామెంట్స్.. అలా అర్థం చేసుకున్నారంటూ..

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి (Surekha Vani)కుమార్తె సుప్రీత (Supritha)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా అధికారికంగా అరంగేట్రం చేసేలోపే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఫోటోలు, రీల్స్, పర్సనల్ అప్‌డేట్స్‌తో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాపులారిటీయే ఆమెకు వెండితెర అవకాశాలకూ దారి తీసింది. ఈ అమ్మడు తన తల్లి, నటి సురేఖ వాణి రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించింది. ఇంతకీ ఏమన్నారంటే?

తాజాగా యంగ్ హీరోయిన్ సుప్రీత నటించిన తొలి సినిమా అమరావతికి ఆహ్వానం (Amaravathiki Aahvanam) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, సుప్రీత స్క్రీన్ ప్రెజెన్స్‌పై మాత్రం చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె కాన్ఫిడెన్స్, నేచురల్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయనే అభిప్రాయం వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సుప్రీత... ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లిపై తాను చేసిన కామెంట్స్ కు క్లారిటీ ఇచ్చింది.

Supritha Responds to Surekha Vani Second Marriage Rumours After Amaravathiki Aahvanam Release

'అమ్మకు పెళ్లి చేయాలనేది నా ఆలోచన మాత్రమే'
సుప్రీత మాట్లాడుతూ... 'ఒక ఇంటర్వ్యూలో నన్ను అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన ఉందా అని అడిగారు. దానికి నేను అవునని చెప్పాను. కానీ, ఆ మాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం చేశారు. అది పూర్తిగా తప్పు'అని తెలిపింది.

తన తండ్రి సురేష్ తేజ మరణం తర్వాత సురేఖ వాణి కుటుంబ బాధ్యతలను ఒంటరిగా చూసుకుంటున్నారని, ప్రస్తుతం ఆమెకు రెండో పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని సుప్రీత స్పష్టం చేసింది. 'నేను పెళ్లి చేసుకుని సెటిల్ అయితే అమ్మ ఒంటరిగా ఉండిపోతుంది అనిపించింది. అందుకే ఆమెకు తగిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను. కానీ అది నా అభిప్రాయం మాత్రమే... అమ్మది కాదు' అని క్లారిటీ ఇచ్చింది.

తల్లి సంతోషమే ముఖ్యం
భవిష్యత్తులో తన తల్లి ఏ నిర్ణయం తీసుకున్నా తాను పూర్తి మద్దతు ఇస్తానని సుప్రీత పేర్కొంది. 'అమ్మ సంతోషంగా ఉండాలి. ఆమె జీవితంపై తీసుకునే నిర్ణయాలను నేను గౌరవిస్తాను' అని చెప్పింది. ఈ వ్యాఖ్యలతో మరోసారి సురేఖ వాణి రెండో పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లి జీవితంలో సంతోషం ముఖ్యమని, ఆమె నిర్ణయాలను గౌరవిస్తానని పేర్కొంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన సురేఖ వాణి, ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హవా నడిపిస్తోంది.

హీరోయిన్‌గా సుప్రీత ఎంట్రీ
ఇక మరోవైపు సుప్రీత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' సినిమా ఆలస్యమవడంతో... ఆమె 'అమరావతికి ఆహ్వానం'సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మరో తమిళ సినిమాతో పాటు తెలుగులో మరో ప్రాజెక్ట్‌కి కూడా కమిట్ అయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు, పార్టీలతో తరచూ ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ... అవన్నీ లైట్ తీసుకుంటూ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టినట్లు సుప్రీత చెబుతోంది. తల్లి లాగే టాలీవుడ్‌లో తనదైన మార్క్ చూపించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.

More from Filmibeat

Read more about: supritha surekha vani tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X