‘లిప్‌లాక్ సీన్ .. ఆ హీరో నోరు కంపుకొట్టేది.. కాంప్రమైజ్ కావాల్సిందే ’
రెండున్నర గంటల పాటు థియటర్‌లో ప్రేక్షకుడిని కూర్చోబెట్టడానికి నటీనటులు ఎంతో కష్టపడుతుంటారు. ఒళ్లు హూనం చేసుకుని , కాళ్లు చేతులు విరగ్గొట్టుకుని , ప్రాణాల మీదకి తెచ్చుకున్నవారెందరో. ఇక కథను బట్టి రొమాంటిక్ సీన్స్‌లో , లిప్‌లాక్స్‌లో నటీనటులు నటించాల్సి ఉంటుంది. క్లోజ్‌డ్ రూమ్‌లో పది మంది ముందు నటించడం కష్టం. కానీ సినిమా కోసం కళ్లు మూసుకుని సీన్స్ చేసేస్తారు. తాజాగా లిప్‌లాక్ సీన్ కోసం తాను పడిన బాధను పంచుకున్నారు ఓ హీరోయిన్.
అశిక్ అబు దర్శకత్వంలో విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, సురభి లక్ష్మీ, వాణీ విశ్వనాథ్, అనురాజ్ కశ్యప్ కీలక పాత్రల్లో పోషించిన మలయాళ చిత్రం రైఫిల్ క్లబ్. ఓపీఎం సినిమాస్, టీఆర్‌యూ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా గతేడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. రివేంజ్ స్టోరీయే అయినా యాక్షన్ స్టంట్స్, కొత్తగా కథను ప్రజంట్ చేసిన తీరుకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.

యూత్‌కి రైఫిల్ క్లబ్ బాగా ఎక్కడంతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ టైంలో థియేటర్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన బరోజ్ : 3 డీ, ఉన్ని ముకుందన్ మార్కోలకు రైఫిల్ క్లబ్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 16 నుంచి రైఫిల్ క్లబ్ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలోనూ మంచి వ్యూయర్ షిప్‌ను అందుకుంది.
ఈ సినిమా కథ , కథనంతో పాటు క్లైమాక్స్‌లో వచ్చే లిప్‌లాక్ సీన్ హైలైట్‌గా నిలిచింది. సురభి లక్ష్మీ, సజీవ్ కుమార్‌లు ఈ సీన్‌లో నటించారు. సాధారణంగా కథలో ఇలాంటి లిప్ లాక్స్ ఉంటే దర్శక నిర్మాతలు నటీనటులకు ముందే చెబుతారు. మధ్యలో అలాంటి సీన్స్ పెడితే.. నటీనటులు ఒప్పుకోకపోతే లేనిపోని తలనొప్పులు వస్తాయని ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఆ రోజు షూటింగ్ స్పాట్‌కు వెళ్లేవరకు సురభి లక్ష్మీకి ఈ లిప్‌లాక్ సీన్ ఉన్నట్లు తెలియదు. సెట్‌లోనే దర్శకుడు ఈ సీన్ చెప్పారట.
తొలుత ఓ చిన్న ముద్దే కదా చేసేస్తే ఓ పని అయిపోతుందని సురభి కూడా తనను తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. కానీ కాస్త ఘాటుగా, మరింత హాట్‌గా లిప్ లాక్ ఉండాలని దర్శకుడు చెప్పాడు. అయితే తాను ముద్దు పెట్టాల్సిన నటుడు సజీవ్ కుమార్‌కు విపరీతంగా సిగరెట్ తాగే అలవాటు ఉంది. నోటి నుంచి సిగరెట్ వాసన వస్తుండటంతో లిప్‌లాక్ కంటే ముందు బ్రష్ చేసుకోవాలని ఆయనకి చెప్పిందట. దీనికి సజీవ్ కుమార్ కూడా సరేనని చెప్పగా.. సురభి లక్ష్మీ కూడా యాలకులు నమిలేసి షాట్ రెడీ అనగానే అలవోకగా లిప్‌లాక్ చేసేశారట. ఈ సీన్ కోసం నేను టెన్షన్ పడలేదని, అదొక పాత్రని, కథకు తగ్గట్లుగా నటించాలని అంతకుమించి ఏం ఆలోచించలేదని సురభి లక్షీ క్లారిటీగా చెప్పేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్నట్లు ఈ సురభి లక్ష్మీ మల్టీ టాలెంటెడ్, ఉన్నత విద్యావంతురాలు. భరతనాట్యంలో గ్రాడ్యుయేట్, థియేటర్ ఆర్ట్స్‌లో ఎంఏ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఎంఫిల్ చేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. 2016లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా ఈమె తన ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











