విశ్వంభరలో మరో క్యూట్ హీరోయిన్.. ఏ పాత్రను చేస్తుందో తెలిస్తే షాకే!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించి.. బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతోన్న ఆయన.. గతంలో కంటే ఇప్పుడు ఎంతో వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే చిరంజీవి ఎన్నో భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే చిత్రాన్ని చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కేటాయించి ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఇందులో భాగంగానే పలు షెడ్యూళ్లను ప్లాన్ చేసి క్రేజీ సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు.
విజువల్ వండర్‌గా రాబోతున్న 'విశ్వంభర' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. అంతేకాదు, కొందరు యాక్టర్లను కూడా ఫైనల్ చేసేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన సురభిని ఫైనల్ చేసినట్లు తెలిసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీలో చాలా మంది హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ ముఖ్యమైన పాత్రకు యంగ్ హీరోయిన్ సురభిని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, సురభి ఇందులో చిరంజీవి సోదరిగా నటింబోతున్నట్లు తాజాగా మరో న్యూస్ లీకైంది.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











